|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనాకు సీఐ మర్యాదలు, పొగడ్తలు- సంజును కొట్టిన మీనా- బాలు రక్తం చూస్తాడంటూ వార్నింగ్

Published: 25-08-2025, 6:50 AM
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనాకు సీఐ మర్యాదలు, పొగడ్తలు- సంజును కొట్టిన మీనా- బాలు రక్తం చూస్తాడంటూ వార్నింగ్

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్‌లో మీనా తన భర్త బాలుకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టేందుకు పోరాడుతుంది. సిసిటీవీ ఫుటేజ్‌తో నిజం వెలుగులోకి వస్తుంది.

Key Points

1

మీనా బాలుకు జరిగిన అన్యాయాన్ని బయటపెడుతుంది.

2

సిసిటీవీ ఫుటేజ్‌తో బాలు నిర్దోషి అని రుజువు అవుతుంది.

4

బాలుకు జరిగిన అన్యాయం బయటపడి వైరల్ అవుతుంది.

మీనా పోరాటం

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో బారుకెళ్లిన మీనా భర్త బాలు గురించి, పడిన నింద గురించి జరిగింది అంతా చెబుతుంది. ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు. నీకు నిజం చెప్పేవారు ఎవరుంటారు అని బారు ఓనర్ అంటే.. సీసీ కెమెరా చూపిస్తుంది. దయచేసి కెమెరాలో రికార్డ్ అయింది చూపిస్తే నా భర్త ఇందులో నుంచి బయటపడతారు. మీ కూతురు లాంటిదాన్ని సహాయం చేయండి అని మీనా అంటుంది.

దాంతో ఓనర్ సరే అని ఒప్పుకుని వర్కర్‌ని పిలిచి సీసీటీవీ ఫుటేజ్ చూపించమంటాడు. బాలు తాగనిది, కేవలం చికెన్ తినేది, గుణ వీడియో తీయడం అంతా చూస్తారు. కావాలనే చేశారు అని ఇద్దరు అనుకుంటారు. మా మరిది రవి నెంబర్ ఇస్తాను. అతనికి పంపించండి అని మీనా అంటే.. అతను పంపిస్తాడు. దాంతో థ్యాంక్స్ చెప్పి. చాలా సహాయం చేశారు అని మీనా చెబుతుంది.

ఆ వీడియోను రవి చూస్తాడు. మీనా కాల్ చేసి ఆ వీడియోను ఎవరు ఎడిట్ చేశారో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. నాకు తెలిసివాళ్లతో తెలుసుకుంటాను అని రవి అంటాడు. రాజేష్ వాళ్లతో బాలు పోలీసులు చెప్పింది చెబుతాడు. ఇంతలో రవి వచ్చి వదిన నీకోసం ఎంత కష్టపడుతుందో తెలుసా అని చెబుతాడు. ఇంతలో మీనా వచ్చి బాలును హగ్ చేసుకుంటుంది.

మీరు చెప్పింది వినలేదు. నమ్మలేదు. క్షమించండి అని మీనా అంటే రవి కూడా చెబుతాడు. తర్వాత వీడియో ఎడిట్ చేసిన యూట్యూబర్ వస్తాడు. సెన్సేషనల్ కంటెంట్ ఉంది రమ్మన్నారు అని అతను అంటూ మీనాను చూసి షాక్ అవుతాడు. వెళ్తాను అంటే రవి, రాజేష్ ఇద్దరు పట్టుకుంటారు. ఇదంతా ఎవరు చేయించమన్నారో చెప్పకపోతే కారుతో గుద్దేస్తారు అని రవి చెబుతాడు.

దాంతో గుణ అనే మనిషి సీసీటీవీ ఫుటేజ్ పంపి ఎడిట్ చేయించమన్నాడు. డబ్బులు ఇచ్చాడని యూట్యూబర్ చెబుతాడు. బాలుకు జరిగిందంతా చూపిస్తారు. మీనా నాకోసం ఇంత చేశావా అని మీనాను బాలు హగ్ చేసుకుంటారు. ఇదంతా అందరికి తెలియాలి అని మీనా అంటుంది. బాధితుడివి నువ్వే కాబట్టి నువ్వే వీడియోలో చెప్పాలి అని రవి అంటాడు.

సత్యం బయటపడటం

నేను అప్పుడప్పుడు మందు తాగుతాను. కానీ, తాగి ఎప్పుడు కారు నడపలేదు. గుణ అనేవాడి కావాలనే నన్ను ఇరికించాడు. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఇదంతా నా భార్య బయటపెట్టింది. ఇలాంటి భార్య నాకు దొరకడం అదృష్టం అని బాలు చెబుతాడు. అదంతా రవి వీడియో తీస్తాడు. ఈ వీడియో జనాల్లోకి వెళ్లేలా చూడాలి అని మీనా అంటే.. సరే అని యూట్యూబర్ చెబుతాడు.

ఆ వీడియో వైరల్ అవుతుంది. శివ, పోలీసులు, పార్వతి అంతా ఆ వీడియో చూస్తారు. సత్యంకు రంగా కాల్ చేసి వీడియో చూడమంటాడు. సత్యం చూసి సంతోషిస్తాడు. బాలు వాళ్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్తారు. మీనాకు గౌరవం ఇచ్చి కూర్చోమంటాడు సీఐ. ఏమ్మా టీ తెప్పించనా అని మీనాను అడుగుతాడు సీఐ. నీకు తెలివితేటలు బాగున్నాయి. ఎక్కడైతే నిజం తెలుస్తుందో బాగా ఆలోచించావ్. చాలా పెద్ద సాహసం చేశావ్ అని సీఐ అంటాడు.

బాలు మాట్లాడితే సీఐ మాట్లాడనివ్వడు. కారు తీసుకెళ్లమని మీనాకు చెబుతాడు సీఐ. అన్ని అక్కడే మాట్లాడతడా.. నాతో మాడ్లాడడ అని బాలు అనుకుంటాడు. ఇంతలో గుణను పోలీసులు తీసుకొస్తారు. పిక్ పాకెట్ చేసుకునేవాడివి ఇంక మారలేదా అని సీఐ అంటాడు. నేను సమాజ శ్రేయస్సు కోసం చేశాను అని గుణ అంటే.. నిన్ను లోపల వేసి నేను కూడా అదే చేస్తాను అని సీఐ అంటాడు.

బాలు నువ్ నిరపరాధివని ప్రూవ్ అయింది. వీడి సంగతి మాకు వదిలేయ్. మేము చూసుకుంటాం. నీకు నష్టపరిహారం కూడా ఇప్పిస్తాను అని సీఐ అంటే.. పేదవాళ్లను దోచుకున్న డబ్బు సర్ అది. నాకు వద్దు జైలుకు పంపిస్తే చాలు అని బాలు అంటాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. జైలుకు కూడా పంపిస్తాం అని సీఐ అంటాడు. వీడిని ఇంతకుముందే నాలుగు తంతే బాగుండు అని మీనా అంటుంది.

వైరల్ వీడియో

అంతే కదా పోలీస్ స్టేషన్‌లో సీఐ ముందే గుణను తెగ కొడతాడు బాలు. సీఐ వారిస్తే మా ఆవిడ ముచ్చటపడి అడిగింది సర్ ఏమనుకోకండి అని బాలు అంటాడు. ఏరా మా ఆయన అంటే ఏంటో అర్థమైందిగా. జైల్లో చిప్పకూడు తిను అని మీనా అంటుంది. బాలు, మీనా పోలీస్ స్టేషన్ నుంచి వెళ్తారు. కారు వచ్చింది కానీ, కొంచెం అవమానంగా ఉందిరా అని బాలు అంటాడు.

ఈ సీఐ మీనాను పొగిడాడు కానీ నన్ను పట్టించుకున్నాడా. నన్ను పట్టుకుని పశ్చాత్తాపంతో నిజం తెలియక నిన్ను మాటలు అన్నాను అని నాతో అన్నాడా అని బాలు అంటాడు. సరే నాతో అన్నవన్నీ మీతో అనిపిస్తాను అని మీనా అంటే.. వద్దని బాలు అంటాడు. ఇంటికెళ్లాక దిష్టి తీయించాలని బాలు అంటాడు. తర్వాత ఎస్సై భార్యకు మీనా పూలు తీసుకుని వెళ్తుంది.

అక్కడ మీనాను చూసిన ఎస్సై బాలు కారు తీసుకోడానికి వీడియో ఒక్కటే కారణం కాదు. సంజు అనే వ్యక్తి కమిషనర్‌కు కాల్ చేసి సీజ్ చేయించమన్నాడు అని ఎస్సై చెబుతాడు. అదే విషయం మౌనికకు మీనా చెబుతుంది. ఎవరెవరో మా అన్నయ్య విషయంలో కుట్ర చేశారు. కానీ, చివరికి న్యాయమే గెలిచింది అని మౌనిక అంటుంది.

ఏమన్నావే అని మౌనికను సంజు కొట్టబోతుంటే మీనా ఆపి సంజునే కొడుతుంది. సంజు రివర్స్ అవుతుంటే బాటిల్ పట్టుకుని కొట్టేందుకు రెడీగా ఉంటుంది. నీ గురించి మా ఆయనకు తెలియదు. తెలిసిన రోజే నీకు ఆఖరి రోజు. ఆడపడుచు కన్నీళ్లు పెడితే నీ రక్తం చూస్తాడు అని మీనా వార్నింగ్ ఇస్తుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరికి బాలు నిర్దోషి అని రుజువై, అతనిపై పడిన అపవాదులు తొలగిపోతాయి. మీనా ప్రయత్నాల వల్ల సత్యం బయటపడి, న్యాయం జరుగుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.