|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

₹2900 కోట్ల ఆస్తి ఉన్నా సింగిల్ రూమ్ లో సల్మాన్ ఖాన్! కారణం తెలిస్తే షాక్ అవుతారు!

Published: 18-01-2026, 11:15 PM
₹2900 కోట్ల ఆస్తి ఉన్నా సింగిల్ రూమ్ లో సల్మాన్ ఖాన్! కారణం తెలిస్తే షాక్ అవుతారు!
  • 2900 కోట్ల ఆస్తి ఉన్నా, సల్మాన్ ఖాన్ సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లోనే నివాసం!
  • ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నా సాదాసీదా జీవితం గడుపుతున్న సల్మాన్.
  • గత నాలుగు దశాబ్దాలుగా ముంబైలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న సల్మాన్ ఖాన్.
  • తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలనే సల్మాన్ ఖాన్ కోరిక! అందుకే చిన్న ఇంట్లో ఉంటున్నాడు.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ఒక షాకింగ్ న్యూస్! ఇంత డబ్బు సంపాదించినా ఆయన ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాడు. అసలు ఎందుకు? పూర్తి వివరాల్లోకి వెళ్తే.

సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో సల్మాన్ ఖాన్ నివాసం!

కెరీర్ బిగినింగ్ లో ఎన్ని ఇబ్బందులు పడ్డా.. స్టార్ డమ్ వచ్చిన తరువాత హీరోలు, హీరోయిన్లు, నటీనటులు ఎవరైనా.. లగ్జరీ జీవితానికి అలవాటు పడుతుంటారు. భారీ బంగ్లాలు, ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవితం వారిని చుట్టుముట్టడం సాధారణమే. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే హీరోల విషయంలో అయితే ఈ లైఫ్‌స్టైల్ మరింత హైలైట్‌గా కనిపిస్తుంది. బాలీవుడ్‌లో షారుక్ ఖాన్ మన్నత్, అమితాబ్ బచ్చన్ జల్సా వంటి ఖరీదైన ఇళ్లు అందుకు ఉదాహరణలు. అయితే ఈ ట్రెండ్‌కు పూర్తిగా భిన్నంగా జీవిస్తున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.

దాదాపు 40 ఏళ్లుగా బాలీవుడ్‌ను ఏలుతున్న సల్మాన్ ఖాన్, టాప్ హీరోలలో ఎప్పుడూ ముందువరుసలో ఉంటాడు. ప్రస్తుతం 60 ఏళ్ల వయసులోనూ బాలీవుడ్ బాక్సాఫీస్‌ను శాసిస్తున్న ఈ హీరో, ఒక్క సినిమాకు రూ.50 నుంచి 100 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. బాలీవుడ్ సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఆయన సుమారు రూ.2900 కోట్ల ఆస్తిని సంపాదించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ సల్మాన్ ఖాన్ లగ్జరీ జీవితం వైపు మొగ్గు చూపడం లేదు.

తల్లిదండ్రులే కారణమా? అసలు నిజం ఇదే!

బాలీవుడ్ స్టార్ హీరోలు ముంబయిలో భారీ బంగ్లాలు, సీ ఫేసింగ్ విలాల్లో నివసిస్తుంటే, సల్మాన్ ఖాన్ మాత్రం గత నాలుగు దశాబ్దాలుగా ముంబయి బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో ఒక చిన్న 1BHK ఫ్లాట్‌లోనే నివసిస్తున్నాడు. సల్మాన్ మాత్రమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులంతా ఇదే అపార్ట్‌మెంట్‌లో వివిధ అంతస్తుల్లో ఉంటున్నారు. సల్మాన్ ఖాన్ 1BHK ఫ్లాట్‌లో ఉండగా, ఆయన తల్లిదండ్రులు పై అంతస్తులో ఉన్న 3 బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో నివసిస్తున్నట్లు సమాచారం.

ఇంత సంపాదిస్తూ కూడా సల్మాన్ ఖాన్ చిన్న ఇంట్లోనే ఉండటానికి ప్రధాన కారణం తన తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలన్న కోరికేనని తెలుస్తోంది. కుటుంబంతో కలిసి సాధారణ జీవితం గడపడం సల్మాన్ ఖాన్‌కు ఎంతో ఇష్టమని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఒకప్పుడు ఆయన షూటింగ్స్‌కు సైకిల్ మీదే వెళ్లేవాడట. సైక్లింగ్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం ఉండడంతో, సైకిల్ వెనకే కార్లు, సెక్యూరిటీ సిబ్బంది వచ్చేవారని సమాచారం.అయితే ఇటీవల సల్మాన్ ఖాన్‌కు భద్రతాపరమైన సమస్యలు తలెత్తడంతో, ప్రస్తుతం ఆయన కఠిన భద్రత మధ్యనే ఉంటున్నారు.

సింపుల్ లైఫ్ అంటే సల్మాన్ కే సాధ్యం!

సల్మాన్ ఖాన్ తర సింగిల్ బెడ్ రూమ్ ప్లాట్ బాల్కానీకి కూడా బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ తో రక్షణ ఏర్పాటు చేసుకున్నారు. బుల్లెట్‌ప్రూఫ్ కారు ఉపయోగిస్తూన్నారు. లారెన్స్ గ్యాంగ్ సల్మాన్ ను చంపేస్తాం అని పబ్లిక్ గా బెదిరించడంతో..ప్రభుత్వం సల్మాన్ కు వై కేటగిరీ బద్రతను కల్పిస్తోంది. ఆయన ఎక్కడికి వెళ్లినా.. టైట్ సెక్యూరిటీతో ప్రయాణిస్తున్నారు. బంగ్లా లేకపోయినా, పణ్వెల్‌లో ఉన్న 150 ఎకరాల ఫామ్‌హౌస్‌లో ప్రతి ఏడాది కొన్ని నెలలు గడుపుతుంటారు సల్మాన్. అక్కడే పార్టీలు చేసుకుంటారు. సల్మాన్ వ్యవసాయ పనులు కూడా చేస్తుంటాడు.

సల్మాన్ ఖాన్ సింపుల్ లైఫ్ గురించి తెలిసి షాక్ అయ్యారా? మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి. తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.