
📌 Key Points
- దిల్ రాజు నిర్మాణంలో సల్మాన్ ఖాన్ మూవీ.. వంశీ పైడిపల్లి దర్శకత్వం!
- రూ.350-400 కోట్ల భారీ బడ్జెట్ తో ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్!
- సల్మాన్ కెరీర్ లోనే బాధ్యతాయుతమైన పాత్రలో కనిపించనున్నాడు.
- దేవి శ్రీ ప్రసాద్ సంగీతం.. 2026లో షూటింగ్ ప్రారంభం!
టాలీవుడ్ లో మరో సంచలనం! బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో కలిసి పనిచేయనున్నారు. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అభిమానులకు ఇది ఒక పండగలాంటి వార్త!
దిల్ రాజు నిర్మాణంలో సల్మాన్ మూవీ!
Salman Khan: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబో సెట్ అయ్యిందా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. టాలీవుడ్ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో ఒక భారీ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారట. విజయ్ ‘వారసుడు’ ఫేమ్ వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతుండటం విశేషం. ఈమధ్య కాలంలో చాలా మంది టాలీవుడ్ మేకర్స్ బాలీవుడ్ స్టార్లతో సినిమాలు చేస్తూ గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే నిర్మాత దిల్ రాజు సల్మాన్ ఖాన్(Salman Khan)తో భారీ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా కోసం దిల్ రాజు ఏకంగా రూ.350 నుంచి 400 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధం అవుతున్నాడట. సాధారణంగా దర్శకుడు వంశీ పైడిపల్లి బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాలను అద్భుతంగా తెరకెక్కిస్తారు. ఇప్పుడు సల్మాన్ కోసం కూడా ఆయన ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్‌ను సిద్ధం చేశారట.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో భారీ యాక్షన్!
ఈ సినిమాలో సల్మాన్ మునుపెన్నడూ లేని విధంగా ఒక బాధ్యతాయుతమైన, అదే సమయంలో మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించే పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక మాస్టర్ మైండ్ దిల్ రాజు వారసుడు సినిమాతో కోలీవుడ్‌లో సక్సెస్ అందుకున్నట్టుగానే ఇప్పుడు బాలీవుడ్‌లో నేరుగా జెండా పాతాలని చూస్తున్నాడట. అందుకోసం సల్మాన్ ఖాన్ అయితేనే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యాడట. ఇక, సల్మాన్ ఖాన్ క్రేజ్‌కు వంశీ పైడిపల్లి మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ రికార్డుల వేట మొదలవ్వడం ఖాయం.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం.. రికార్డులు షురూ!
పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నట్టు సమాచారం. గతంలో సల్మాన్ కోసం దేవి శ్రీ ప్రసాద్ ‘రింగ రింగ’ అనే పాటను రీమిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సోలోగా మ్యూజిక్ చేసే అవకాశం దక్కించుకున్నాడు దేవి శ్రీ ప్రసాద్. ఇక సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా ఇప్పటికే పూర్తయిందని, 2026 ద్వితీయార్ధంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. మరి క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఆడోయన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.
సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ మూవీ టాలీవుడ్ లో ఒక సంచలనం సృష్టించబోతుంది. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


