
📌 Key Points
- సల్మాన్ ఖాన్‌తో వంశీ పైడిపల్లి మూవీ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సల్మాన్ ఖాన్.
- ఏప్రిల్లోనే షూటింగ్ ప్రారంభం.. భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మాణంలో సినిమా!
- 19 ఏళ్ల కెరీర్‌లో సల్మాన్ తో మూవీ చేయనున్న వంశీ పైడిపల్లి.
- టాలీవుడ్, బాలీవుడ్ కాంబినేషన్‌లో నెక్స్ట్ లెవెల్‌లో ప్రొడక్షన్ ఉండనుంది.
టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి బాలీవుడ్ బాద్‌షా సల్మాన్ ఖాన్‌తో చేతులు కలిపారు! దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా ఒక భారీ మల్టీస్టారర్‌గా రాబోతోంది. అభిమానులకు ఇది ఒక పండగే.
సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి మూవీ అఫీషియల్!
Salman Khan: సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి మూవీని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్లోనే ప్రారంభం కానున్నట్లు వెల్లడిస్తూ సల్మాన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో చూడండి.
Salman Khan: టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో చేతులు కలిపాడు. అప్పుడెప్పుడో మూడేళ్ల కిందట దళపతి విజయ్ తో వారసుడు మూవీ చేసిన అతడు.. ఈసారి సల్మాన్ తో మూవీ చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ సోమవారం (మార్చి 30) వచ్చేసింది. ఎప్పటినుంచో ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న రూమర్స్‌ను నిజం చేస్తూ.. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖానే ఈ విషయాన్ని తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు.
సల్మాన్ ఖాన్ మాస్ ట్వీట్..
దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ మూవీ!
ఈ డైలాగ్ చూస్తుంటేనే సినిమాలో సల్మాన్ యాక్షన్, ఎమోషన్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో మనం అర్థం చేసుకోవచ్చు. సల్మాన్ ఖాన్ లాంటి ఒక మాస్ హీరోను మన టాలీవుడ్ డైరెక్టర్ ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలని అభిమానులంతా చాలా ఎక్సయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు.
భారీ బడ్జెట్.. దిల్ రాజు ప్రొడక్షన్..
దిల్ రాజు తో పాటు కుల్దీప్ రాథోడ్, రఫీ ఖాజీ ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ కచ్చితంగా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని పక్కాగా చెప్పొచ్చు.
ఏప్రిల్ నుండి షూటింగ్ ప్రారంభం!
వచ్చే ఏడాది గ్రాండ్ రిలీజ్..
19 ఏళ్ల కెరీర్లో కేవలం ఆరే సినిమాలు తీసిన వంశీ.. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో మూవీ చేయబోతుండటం నిజంగా విశేషమే. ప్రస్తుతం సల్మాన్.. మాతృభూమి మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ మూవీ టాలీవుడ్‌లో ఒక సంచలనం సృష్టించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


