|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌కు రూ.200 కోట్లు.. నిర్మాత ఏమన్నారంటే?

Published: 29-10-2025, 12:52 PM
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌కు రూ.200 కోట్లు.. నిర్మాత ఏమన్నారంటే?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ ఖాన్ బిగ్ బాస్ సీజన్ 19కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో కోసం ఆయనకు రూ.200 కోట్లు పారితోషికం వస్తోందని వార్తలు రావడంతో, బిగ్ బాస్ నిర్మాత రిషి నెగి స్పందించారు. ఈ అంశం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

సల్మాన్‌ ఖాన్ హిందీ బిగ్ బాస్ సీజన్ -19 కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

2

బిగ్ బాస్ కోసం ఆయనకు రూ.200 కోట్ల పారితోషికం అందుతోందని రూమర్స్ వచ్చాయి.

4

సల్మాన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నా అర్హుడేనని నిర్మాత పేర్కొన్నారు.

బిగ్ బాస్ హోస్ట్ గా సల్మాన్ ఖాన్

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పేరు ఇటీవల తెగ వినిపిస్తోంది . ఆయనపై పాకిస్తాన్ ‌ ఉగ్రవాద ముద్ర వేయడంతో మరింత హాట్ టాపిక్ ‌ గా మారింది . సౌదీ అరేబి యాలోని రియాద్‌లో జరిగిన కార్యక్రమంలో సల్మాన్‌ ఖాన్‌ బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రస్తావించారు . దీంతో పాక్ తన వక్రబుద్ధిని చూపుతూ సల్మాన్ ‌ పై టెర్రిరిస్ట్ ముద్ర వేసింది .

ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ ప్రస్తుతం హిందీ బిగ్ ‌ బాస్ రియాలిటీ షో సీజన్ -19 కు హోస్ట్ ‌ గా వ్యవహరిస్తున్నారు . అత్యంత భద్రతా వలయంలో ఈ షోను హోస్ట్ ‌ చేస్తున్నారు . అయితే గతంలో సల్మాన్ ‌ రెమ్యునరేషన్ ‌ పై పెద్దఎత్తున రూమర్స్ వినిపించాయి . ఈ షో కోసం ఏకంగా రూ .200 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి .

రెమ్యునరేషన్ పై నిర్మాత స్పందన

రూ.200 కోట్ల వార్తలపై వివరణ

తాజాగా ఈ వార్తలపై బిగ్ ‌ బాస్ రియాలిటీ షో నిర్మాత రిషి నెగి రియాక్ట్ అయ్యారు . ఆయనకు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చినా .. అందుకు అర్హుడని అన్నారు . ఆయనకు జియో హాట్ ‌ స్టార్ ‌ తో ఉన్న ఒప్పంద ప్రకారమే పారితోషికం ఉంటుందని తెలిపారు . అయితే అది ఎంత అనేది మాత్రం తాను చెప్పలేనన్నారు . కాగా .. సల్మాన్ ‌ ఖాన్ .. బిగ్‌బాస్ ‌ హోస్ట్ ‌ గా రూ.150 నుంచి రూ.200 కోట్లు తీసుకున్నారంటూ రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే .

సల్మాన్‌ ఖాన్ భారీ పారితోషికంపై వస్తున్న వార్తలపై నిర్మాత రిషి నెగి స్పందించారు. ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నా దానికి అర్హుడని, జియో హాట్‌స్టార్ ఒప్పందం మేరకే ఉంటుందని స్పష్టం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.