|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సల్మాన్ తో సమంత జోడీ ఫిక్స్! రాజ్ & డీకే దెబ్బకు బాలీవుడ్ షేక్!!

Published: 10-03-2026, 2:35 AM
సల్మాన్ తో సమంత జోడీ ఫిక్స్! రాజ్ & డీకే దెబ్బకు బాలీవుడ్ షేక్!!
  • సల్మాన్ ఖాన్ సరసన సమంత.. ఇది నిజంగా ఒక క్రేజీ కాంబినేషన్!
  • రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో భారీ యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్!
  • ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌తో పాన్-ఇండియా గుర్తింపు తెచ్చుకున్న సమంత!
  • సల్మాన్ మాస్ ఇమేజ్‌కు, సమంత యాక్టింగ్‌కు పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ!

టాలీవుడ్ లో ఒక సంచలనం! బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ సరసన సమంత నటించనున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొల్పింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

సల్మాన్, సమంత కాంబోలో రాజ్ అండ్ డీకే మూవీ!

Salman-Samantha: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ కాబోతుందా? అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ కాంబో మరేదో కాదు బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ హీరోగా, స్టార్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకనట రానుంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా సౌత్ స్టార్ బ్యూటీ సమంతను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌తో సమంత(Salman-Samantha) పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వారితోనే ‘సిటాడెల్: హనీ బన్నీ’లో కూడా చేసింది. ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్ తో నటించే అవకాశం దక్కించుకుంది ఈ బ్యూటీ. సల్మాన్ మాస్ ఇమేజ్‌కు, సమంత యాక్టింగ్ పవర్‌కు సరిపోయేలా ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను రాజ్ అండ్ డీకే సిద్ధం చేశారట. ఇక పెళ్లి తరువాత రాజ్- సమంత కలిసి చేస్తున్న సినిమా కావడం విశేషం.

పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో నిర్మాణం!

మామూలుగా సల్మాన్ ఖాన్ పక్కా కమర్షియల్ చేస్తూ ఉంటాడు. కానీ రాజ్ అండ్ డీకే స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఈ రెండు స్టైల్స్ కలిస్తే సినిమా ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక పాన్-ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం జరుగనుందని టాక్. సినిమాలో సమంత కేవలం గ్లామర్ పాత్రకే పరిమితం కాకుండా, కథను మలుపు తిప్పే ఒక కీలకమైన రోల్‌లో కనిపించనున్నారట.

సమంతకు దక్కిన మరో పవర్ఫుల్ రోల్!

చాలా కాలం తరువాత సమంతకు అలాంటి పాత్ర దక్కడం అది కూడా సల్మాన్ ఖాన్ సినిమాలో అంటే మాములు విషయం కాదు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆ షూటింగ్ కంప్లీట్ అవగానే రాజ్ అండ్ డీకే సినిమా సెట్స్ కి రానున్నాడు సల్మాన్ ఖాన్. ఇంకా ఈ సినిమాకు సంబందించిన మిగత వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

సల్మాన్, సమంత కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి. త్వరలోనే మిగతా వివరాలు తెలియజేస్తాము.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.