|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Samantha: ప్రియుడితో మ‌ళ్లీ దొరికిపోయిన‌ సమంత..? దీపావ‌ళి వేళ క్యూట్ ఫోటోలు వైర‌ల్‌

Published: 21-10-2025, 2:11 AM
Samantha: ప్రియుడితో మ‌ళ్లీ దొరికిపోయిన‌ సమంత..? దీపావ‌ళి వేళ క్యూట్ ఫోటోలు వైర‌ల్‌

టాలీవుడ్ నటి సమంత దీపావళి వేడుకలను తన కొత్త ఇంట్లో జరుపుకున్నారు. ఈ వేడుకల్లో రాజ్ నిడిమోరు పాల్గొనడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి సంబంధం, రెండో పెళ్లి వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఈ క్యూట్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Key Points

1

విడాకుల తర్వాత సమంత కెరీర్, బ్రాండ్ మరింత పెరిగి, వ్యాపారాల్లో దూసుకుపోతున్నారు.

2

అనారోగ్యం నుండి కోలుకొని సమంత తన కెరీర్‌పై ప్రత్యేక దృష్టి సారించారు.

4

సమంత, రాజ్ నిడిమోరుల రిలేషన్, రెండో పెళ్లి వార్తలు ఈ దీపావళి ఫోటోలతో మళ్లీ వైరల్ అవుతున్నాయి.

సమంత కెరీర్, వ్యాపారాల దూకుడు

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత బ్రాండ్ మరింత పెరిగింది. మొదట్లో అనారోగ్యంతో బాధపడిన సమంత, ఆ తర్వాత ఆ క్రమక్రమంగా కోలుకుంది. అదే సమయంలో తన కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెట్టి సక్సెస్ అవుతోంది సమంత. హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా ప్రస్తుతం హీరోయిన్ సమంత దూసుకు వెళ్తున్నారు. అటు వ్యాపారాలు కూడా లాభాల్లో దూసుకు వెళ్తున్నాయి. చేతినిండా సంపాదిస్తున్న సమంత తాజాగా దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇటీవల హీరోయిన్ సమంత ( Samantha ) కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

దీంతో తన కొత్త ఇంట్లోనే తాజాగా దీపావళి చేసుకున్నారట‌ సమంత. అయితే ఈ వేడుకల్లో రాజ్ నిడిమోరు ( Raj Nidimoru) కూడా పాల్గొన్నారు. దీంతో సమంత దీపావళి వేడుకల ఫోటోలు సోషల్ మీడియాను దున్నేస్తున్నాయి. రాజ్ నిడిమోరుతో హీరోయిన్ సమంత రిలేషన్ పెట్టుకుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అతన్నే హీరోయిన్ సమంత త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వైరల్ చేశారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఈ ఇద్దరు ఎక్కడా కూడా స్పందించలేదు. కానీ సమంత ఎక్కడ ఉంటే అక్కడే రాజ్ నిడిమోరు కనిపిస్తున్న‌ నేపథ్యంలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇక లేటేస్ట్ గా దీపావళి వేడుకలు కూడా సమంతతో రాజ్ నిడిమోరు చేసుకున్నాడు. క్లిక్

దీపావ‌ళి వేడుక‌ల్లో రాజ్ నిడిమోరు

సమంత-రాజ్ రెండో పెళ్లి వార్తలు

సమంత, రాజ్ నిడిమోరుల మధ్య ఉన్న బంధంపై ఇప్పటికీ అధికారిక స్పష్టత లేదు. అయితే దీపావళి వేడుకల్లో వారు కలిసి కనిపించడం ఈ రూమర్స్‌కు మరింత ఆజ్యం పోస్తోంది. భవిష్యత్తులో వీరి సంబంధం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.