|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

భర్త కోసం సమంత సంచలన నిర్ణయం! పేరు మార్పుతో కొత్త జీవితానికి నాంది!

Published: 28-01-2026, 11:35 PM
భర్త కోసం సమంత సంచలన నిర్ణయం! పేరు మార్పుతో కొత్త జీవితానికి నాంది!
  • సమంత ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
  • దర్శకుడు రాజ్ నిడిమోరును సమంత డిసెంబర్ 1న వివాహం చేసుకున్నారు.
  • రెండో పెళ్లి తర్వాత తన పేరును సమంత నిడుమోరిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు.
  • గతంలో చైతన్యను పెళ్లి చేసుకున్నప్పుడు అక్కినేని ఇంటి పేరును చేర్చుకున్నారు.

సమంత ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ సినిమాలో నటిస్తున్నారు. దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న తర్వాత, తన పేరును సమంత నిడుమోరిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సమంత కొత్త సినిమా మరియు వ్యక్తిగత జీవితం

Samantha -Raj Nidimoru: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇలా ఈ సినిమా షూటింగ్ తో పాటు బిజినెస్ రంగంలో కూడా సమంత (Samantha)తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉన్న సమంత వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ ఒకటో తేదీ సమంత దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru)ను వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా పెళ్లి తర్వాత సమంత ఎక్కడికి వెళ్లినా తన భర్తతో కలిసి సందడి చేస్తున్నారు. ఇక సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత తిరిగి రెండో పెళ్లి చేసుకోవడంతో సమంత అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈమె వివాహం జరిగి రెండు నెలలు అవుతుంది ఈ నేపథ్యంలోనే తన రెండో భర్త కోసం సమంత కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి భర్త కోసం సమంత తీసుకోబోతున్న ఆ నిర్ణయం ఏంటి అనే విషయానికి వస్తే… సమంత రెండో పెళ్లి తర్వాత తన పేరును మార్చుకోవాలనే నిర్ణయం తీసుకున్నారట. ప్రస్తుతం ఈమె తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో సమంతగా తన పేరు ఉంది. ఇకపై సమంత నిడుమోరి(Samantha Nidimoru)గా తన పేరును మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సమంత ప్రస్తుతం హీరోయిన్గా నటిస్తున్న మా ఇంటి బంగారం(Maa Inti Bangaram) సినిమా టైటిల్ కార్డ్స్ లో కూడా తన పేరు సమంత నిడుమోరిగా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.

రాజ్ నిడిమోరుతో సమంత వివాహం

గతంలో సమంత నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సమయంలో కూడా ఇలాగే పెళ్లి తర్వాత తన భర్త ఇంటి పేరును తన పేరు పక్కన చేర్చుకొని సమంత అక్కినేనిగా చలామణి అయ్యారు. ఇక నాగచైతన్యతో విభేదాలు వచ్చిన నేపథ్యంలో సమంత అక్కినేని ఇంటి పేరును తొలగించడంతో వీరి విడాకుల వార్తలు అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరు అధికారికంగా విడాకుల ప్రకటన ఇస్తూ విడిపోయారు. అప్పటి నుంచి సమంతగానే ఈ ముద్దుగుమ్మ రెండో పెళ్లి తర్వాత తన భర్త పేరును తన పేరు పక్కన చేర్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఇక సమంత కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం నందిని రెడ్డి డైరెక్షన్లో మా ఇంటి బంగారం సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా ఈ టీజర్ వీడియోకి ఎంతో మంచి ఆదరణ లభించింది. లేడీ ఓరియంటెడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం సమంత సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

సమంత పేరు మార్పు నిర్ణయం వెనుక అసలు కారణం

మొత్తానికి సమంత తన జీవితంలో ముందుకు సాగుతున్నారు. పేరు మార్పు నిర్ణయం ఆమె వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.