
📌 Key Points
- SSC GD కానిస్టేబుల్ 2026 పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల.
- మొత్తం 25,487 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ.
- అభ్యంతరాలు సమర్పించడానికి జూన్ 15 నుండి జూన్ 20 వరకు గడువు.
- ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ల కోసం అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in సందర్శించండి.
దేశవ్యాప్తంగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కీలక ప్రకటన చేసింది. SSC GD కానిస్టేబుల్ 2026 పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ విడుదలైంది. అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లతో పాటు కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యంతరాలు సమర్పించడానికి జూన్ 20 వరకు గడువు ఉంది.
ఆన్సర్ కీ డౌన్‌లోడ్ విధానం
దేశవ్యాప్తంగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించిన కానిస్టేబుల్ (GD)-2026 పరీక్షల ప్రాథమిక కీ (Provisional Answer Key) ఇవాళ విడుదలైంది. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లతో పాటు ఆన్సర్ కీని అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే, మొత్తం 25,487 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నియామక ప్రక్రియ జరుగుతోంది. ఈ పోస్టుల కొరకు ఈ ఏడాది ఏప్రిల్ 27 నుంచి మే 30 వరకు దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో సీబీటీ విధానంలో పరీక్షలను నిర్వహించారు. పరీక్ష ముగిసిన నేపథ్యంలో అభ్యర్థుల మార్కులపై ఓ అంచనాకు రావడానికి వీలుగా కమిషన్ అన్సర్ కీని విడుదల చేసింది. ప్రాథమిక కీలో ఏవైనా తప్పులు ఉన్నట్లైతే.. వాటిపై అభ్యంతరాలు (Objections) వ్యక్తం చేసేందుకు SSC అవకాశం కల్పించింది. ఈ మేరకు జూన్ 15 నుంచి జూన్ 20 వరకు వరకు అభ్యర్థుల నుంచి నిర్ణీత రుసుముతో అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఆన్సర్ కీ లింక్ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in/ ను సందర్శించాలని అధికారులు సూచించారు.
అభ్యంతరాల సమర్పణ గడువు
ముఖ్యమైన తేదీలు, వెబ్‌సైట్ వివరాలు
అభ్యర్థులు వెంటనే ఆన్సర్ కీని పరిశీలించి, ఏవైనా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా సమర్పించాలి. ఈ అవకాశం ద్వారా తమ మార్కులపై స్పష్టత పొంది, తదుపరి నియామక ప్రక్రియకు సిద్ధం కావాలి.


