
2010లో విడుదలైన సూపర్ హిట్ సినిమా ‘ఏమాయ చేసావే’ 15 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు. సమంత, నాగ చైతన్య జంట మళ్ళీ తెరపై కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
Key Points
15 ఏళ్ల తర్వాత ‘ఏమాయ చేసావే’ రీ-రిలీజ్
సమంత, నాగ చైతన్య మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో!
ప్రమోషన్లలో వారిద్దరూ పాల్గొంటారా?
‘ఏమాయ చేసావే’ రీ-రిలీజ్
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya), స్టార్ హీరోయిన్ సమంత(Samantha) జంటగా నటించిన బ్లాక్ బస్టర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఏమాయ చేసావే’(Yemaya Chesave). ఇక దీనికి గౌతమ్ వాసుదేవ్ మీనన్(Gautham vasudev Menon) దర్శకత్వం వహించాడు. అయితే 2010లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. నాగ చైతన్యకు లవర్ బాయ్ ఇమేజ్‌ని తీసుకొచ్చింది. అలాగే సమంతను హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం చేసింది. ఏ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం, పాటలు ఇప్పటికీ యువతకు ఇష్టమైన ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. ఈ సినిమా నాటికీ నేటికీ ఒక క్లాసిక్ రొమాంటిక్ చిత్రంగా నిలిచిపోయింది.
అయితే ఈ సినిమా వచ్చి 15 ఏండ్లు అవుతున్న సందర్భంగా మేకర్స్ రీ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను జూలై 18న రీ-రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. మళ్లీ సమంత చైతన్యను ఒకే ఫ్రేమ్‌లో చూస్తున్నామని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి వారిద్దరూ ప్రమోషన్లలో పాల్గొంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ సినిమా టైంలోనే సామ్- చై ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో మ్యారేజ్ అయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకుని విడిపోయారు. ఆఫ్టర్ డివోర్స్ తర్వాత నాగచైతన్య శోభిత ధూళిపాళను రెండో వివాహం చేసుకోగా సామ్ మాత్రం మరో మ్యారేజ్ చేసుకోలేదు.
సమంత, చైతన్య జంట మళ్ళీ
ఫ్యాన్స్ ఆనందం
‘ఏమాయ చేసావే’ రీ-రిలీజ్ తో సమంత, నాగ చైతన్య మళ్ళీ తెరపై కనిపించబోతున్నారు. ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. వారి ప్రమోషన్స్ లో పాల్గొనడం ఆసక్తికరంగా ఉంటుంది.


