|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజ్ ఉంటేనే నేను! భర్త గురించి సమంత సంచలన వ్యాఖ్యలు..షాక్ లో అభిమానులు!

Published: 09-04-2026, 6:35 AM
రాజ్ ఉంటేనే నేను! భర్త గురించి సమంత సంచలన వ్యాఖ్యలు..షాక్ లో అభిమానులు!
  • సమంత తన భర్త రాజ్ నిడిమోరుపై ప్రేమను కురిపిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్.
  • రాజ్ లేకపోతే తన జీవితమే లేదని సమంత తెలిపింది.
  • అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ నిర్మిస్తున్న ‘డెకాయిట్’ చిత్రంపై సమంత ప్రశంసలు.
  • సుప్రియ అంకిత భావాన్ని సమంత కొనియాడింది.

ప్రముఖ నటి సమంత తన భర్త రాజ్ నిడిమోరుపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజ్ లేకపోతే తన జీవితమే లేదని ఆమె పేర్కొంది. అంతేకాకుండా, సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న చిత్రం ‘డెకాయిట్’ను సమంత ప్రశంసించింది.

భర్తపై సమంత ప్రేమ వెల్లువ!

Samantha:ప్రముఖ సినీనటి పాన్ ఇండియా స్టార్ సమంత (Samantha ) తాజాగా తన భర్త రాజ్ నిడిమోరు (Raj Nidimoru)పై తన ప్రేమను ఒలకబోస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒకవైపు తన సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటూనే.. మరొకవైపు అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ పలు విషయాలపై స్పందించే ఈమె.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తన భర్త రాజ్ లేకపోతే తన జీవితమే లేదు అంటూ భర్తపై ప్రశంసలు కురిపించింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

సమంత మాట్లాడుతూ..” నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ఆ ఇబ్బందుల తర్వాత ఒక మంచి వ్యక్తిగా, నటిగా నన్ను నేను మార్చుకోవడానికి రాజ్ కారణమయ్యారు.. ఆయనను విడిచి నేను ఒక్క రోజు కూడా ఉండలేను.. ఒక రకంగా చెప్పాలి అంటే నా జీవితంలోకి ఆయన రాకపోయి ఉండి ఉంటే నేడు నా ఈ జీవితమే ఉండేది కాదు.. అందుకే నా జీవితం ఆయనకే అంకితం అనేట్టు” భర్తపై ప్రేమ ఒలకబోసింది సమంత.. ఇకపోతే సమంత చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. భర్తపై ఆమె చాటుకున్న ప్రేమకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

రాజ్ లేకపోతే జీవితమే లేదు!

ఇకపోతే ఒకవైపు తన భర్త రాజ్ పై ప్రేమ కురిపిస్తూనే.. మరొకవైపు అక్కినేని కుటుంబానికి సమంత అండగా నిలవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న చిత్రం డెకాయిట్. అడివి శేష్ హీరోగా.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వస్తున్న ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు . ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత సుప్రియ యార్లగడ్డపై సమంత ప్రసంశలు కురిపిస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా.. “సుప్రియ.. మీ అంకిత భావాన్ని నేను స్వయంగా చూశాను. కచ్చితంగా ఈ బ్లాక్ బస్టర్ విజయానికి మీరు అర్హులు” అంటూ రాసుకొచ్చింది సమంత. మొత్తానికైతే సుప్రియ పట్ల సమంత చేసిన ఈ కామెంట్ సినిమాపై కూడా అంచనాలు పెంచేసింది. మరి రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

‘డెకాయిట్’ నిర్మాతపై ప్రశంసలు కురిపించిన సమంత

ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే.. మరొకవైపు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది సమంత. ఈ నిర్మాణ సంస్థ ద్వారా శుభం అనే సినిమాను నిర్మించి, నిర్మాతగా సక్సెస్ అయిన ఈమె.. ఈ బ్యానర్లో మా ఇంటి బంగారం అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మే 15వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాలో సమంత లీడ్రోల్ పోషిస్తోంది. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకురాలిగా పనిచేస్తున్నారు.

సమంత తన భర్త రాజ్ పట్ల చూపించిన ప్రేమ, సుప్రియను ప్రశంసించడం ద్వారా తన మంచి మనస్సును చాటుకుంది. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.