
టాలీవుడ్ నటి సమంత తానా 24వ మహాసభల్లో పాల్గొని అభిమానులకు తన కృతజ్ఞతలు తెలిపారు. స్టేజ్‌పై ఆమె భావోద్వేగంతో కూడిన ప్రసంగం అందరినీ కదిలించింది. ఈ కార్యక్రమం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
Key Points
తానా మహాసభల్లో సమంత భావోద్వేగపూరిత ప్రసంగం
15 ఏళ్ల కెరీర్‌లో అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు
వైరల్ అవుతున్న హృద్యమైన వీడియో
సమంత తానా మహాసభల్లో భావోద్వేగ ప్రసంగం
తానా 24వ మహాసభలు మూడు రోజులు సైతం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత(Samantha) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక అక్కడ అభిమానులు చూపిస్తున్న ప్రేమ పట్ల భావోద్వేగానికి గురయ్యారు. సమంత మాట్లాడుతూ.. “ఈ వేదికపై నిలబడటానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. ప్రతి సంవత్సరం తానా గురించి వింటూనే ఉంటాను. నా మొదటి సినిమా ఏ మాయ చేసావే సినిమా నుంచి మీకు ధన్యవాదాలు చెప్పే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. నా ఫస్ట్ మూవీ నుండే మీరు నన్ను మీ సొంతం చేసుకున్నారు. మీరు నాకు ప్రేమను మాత్రమే ఇచ్చారు.
అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు
ఇక్కడికి వచ్చి ధన్యవాదాలు చెప్పడానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. ఇది నా కెరీర్‌లో ఒక ముఖ్యమైన దశ. నా మొదటి ప్రొడక్షన్ శుభం, దానిని ఎక్కువగా అభినందించిన వ్యక్తులు ఉత్తర అమెరికాకు చెందినవారు. నేను తీసుకునే ఏ నిర్ణయం అయినా ముందు తెలుగు ప్రేక్షకుల గురించి ఆలోచిస్తాను.నా కెరీర్‌లో నిర్ణయం తీసుకునే ముందు నాకు వచ్చే మొదటి ఆలోచన అదే. మీరు నాకు ఒక గుర్తింపు ఇచ్చారు. నాకు సొంతిల్లు తెలుగు. నేను నిజంగా చెప్పాలనుకుంటున్నాను.
వైరల్ అవుతున్న వీడియో
ఓ బేబీ మిలియన్ డాలర్లు సంపాదించానని గుర్తుంది. నేను దానిని నమ్మలేకపోయాను. మీరు నాకు దూరంగా ఉన్నప్పటికీ నా హృదయంలో మాత్రం ఉన్నారు. మీకు కృతజ్ఞురాలిని” అంటూ కన్నీళ్లతో స్పీచ్‌ను ముగించేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోవైరల్‌గా మారగా.. ఆమె ఫ్యాన్స్ హార్ట్ టచింగ్‌గా ఉంది సామ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Link
సమంత తన అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ తన భావోద్వేగాలను వ్యక్తం చేశారు. ఆమె ప్రసంగం ప్రతి ఒక్కరినీ కదిలించింది మరియు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


