|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Samantha: ఇలా తగులుకున్నారేంట్రా?.. సమంత తీవ్ర అసహనం!

Published: 17-06-2025, 6:55 AM
Samantha: ఇలా తగులుకున్నారేంట్రా?.. సమంత తీవ్ర అసహనం!

టాలీవుడ్ స్టార్ సమంత తాజాగా ముంబైలో ఒక అసహ్యకరమైన అనుభవాన్ని ఎదుర్కొంది. జిమ్ నుంచి బయటకు వస్తుండగా ఫ్యాన్స్ ఆమెను చుట్టుముట్టడంతో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ సంఘటనతో పాటు, ఆమె బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ రూమర్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

Key Points

1

ముంబైలో జిమ్ తర్వాత సమంతను ఫ్యాన్స్ చుట్టుముట్టారు.

2

ఫోటోలు తీయడానికి ప్రయత్నించినందుకు సమంత తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

4

రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ రూమర్స్ ఇప్పటికీ వైరల్ గా ఉన్నాయి.

ముంబైలో సమంతకు చేదు అనుభవం

టాలీవుడ్ హీరోయిన్ సమంత సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల శుభం మూవీతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన సామ్ ప్రస్తుతం ముంబయిలో బిజీ అయిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్‌ రాజ్ నిడిమోరు తెరకెక్కించనున్న రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్‌ వెబ్ సిరీస్‌లో కనిపించనుంది.

ఫ్యాన్స్‌తో సమంత అసహనం

అయితే తాజాగా ముంబయిలో సమంతకు చేదు అనుభవం ఎదురైంది. బాంద్రాలో జిమ్‌ చేసి బయటికి వస్తుండగా ఆమెను ఒక్కసారిగా ఫోటోలు తీసుకునేందుకు చుట్టుముట్టారు. దీంతో తీవ్ర అసౌకర్యానికి గురైన సామ్.. అరే రూకోజి ప్లీజ్‌ అంటూ హిందీలో మాట్లాడుతూ అసహనంగా కనిపించింది. ఆమె కారు ఇంకా రాకపోవడంతోనే బయట నిలబడాల్సి రావడంతో ఫోటోలు తీసేందుకు ఎగబడ్డారు. దీంతో సమంత అసహన వ్యక్తం చేసింది.

రాజ్ నిడిమోరుతో డేటింగ్ రూమర్స్

కాగా.. గతేడాది సిటాడెల్: హనీ బన్నీలో వరుణ్ ధావన్‌తో కలిసి చివరిసారిగా కనిపించింది. అయితే ఆ తర్వాత సిటాడెల్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ దీనిపై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు. చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి.

ముంబైలో జరిగిన ఈ ఘటన సమంతకు ఎంతో అసౌకర్యాన్ని కలిగించింది. ఫ్యాన్స్ ప్రేమను అర్థం చేసుకుంటూనే, వారితో సరిహద్దులు పాటించడం ఎంతో ముఖ్యమని ఈ సంఘటన తెలియజేస్తుంది. రాజ్ నిడిమోరుతో డేటింగ్ రూమర్స్ మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.