|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Samantha: ట్రెండింగ్‌లో సమంత ఫ్యామిలీ ఫొటో.. నా హృదయం ఉప్పొంగుతుందంటూ ఎమోషనల్ పోస్ట్

Published: 02-12-2025, 11:50 PM
Samantha: ట్రెండింగ్‌లో సమంత ఫ్యామిలీ ఫొటో.. నా హృదయం ఉప్పొంగుతుందంటూ ఎమోషనల్ పోస్ట్
  • సమంత, రాజ్ నిడిమోరు వివాహం కోయంబత్తూరు ఈషా యోగా సెంటర్‌లో జరిగింది.
  • రాజ్ సోదరి శీతల్ నిడిమోరు షేర్ చేసిన సమంత ఫ్యామిలీ ఫొటో వైరల్ అవుతోంది.
  • శీతల్ తన హృదయం ఆనందంతో ఉప్పొంగుతుందని, కుటుంబం పరిపూర్ణమైందని రాసుకొచ్చింది.
  • సమంతకు జీవితకాలం అండగా ఉంటామని శీతల్ తన ఎమోషనల్ పోస్ట్‌లో హామీ ఇచ్చింది.

టాలీవుడ్ నటి సమంత, రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత రాజ్ కుటుంబంతో దిగిన ఫొటో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. రాజ్ సోదరి శీతల్ ఈ ఫొటోను షేర్ చేస్తూ సమంతకు హృదయపూర్వక స్వాగతం పలికింది. ఈ ఎమోషనల్ పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

సమంత వివాహం – కొత్త అధ్యాయం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో రిలేషన్‌షిప్ కొనసాగించిన ఆమె డిసెంబర్ 1న పెళ్లి చేసుకుంది. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో ఈ ప్రేమికులు భార్యభర్తలుగా మారారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్న సమంత అత్త వారింట్లోకి వెళ్లింది. కుటుంబ సభ్యులంతా ఈ జంటకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పగా.. ఫ్యామిలీ ఫొటో కూడా తీసుకున్నారు. ఈ మేరకు రాజ్ సోదరి శీతల్ (Sheetal)ఈ ఫొటో షేర్ చేస్తూ ఎమోషనల్ అయింది. ఎప్పుడూ సమంతకు అండగా ఉంటామని చెప్పుకొచ్చింది. ‘‘నాకు ఆనందంతో మాటలు రావడం లేదు.

వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫొటో

ఆనంద బాష్పాలతో నా హృదయం ఉప్పొంగుతుంది. నేటితో మా కుటుంబం పరిపూర్ణమైంది. సమంత-రాజ్ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతుండాలని కోరుకుంటున్నా. ఒకరిపై ఒకరికి గౌరవం, నిజాయతీతో రెండు హృదయాలు ఒకే మార్గాన్ని ఎంచుకున్నప్పుడు వారి జీవితం ప్రశాంతతో నిండిపోతుంది. మేము సమంతకు జీవితకాలం అండగా ఉంటాము’’ అని రాసుకొచ్చింది. అలాగే సమంత-రాజ్‌తో పాటు తన తల్లిదండ్రులు తన ముగ్గురు కొడుకులతో ఉన్న ఫొటోను షేర్ చేసింది. అయితే ఇందులో శీతల్ భర్త కనిపించకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఫొటోను సోషల్ మీడియాలో సమంత అభిమానులు వైరల్ చేస్తున్నారు. అలాగే ఓ ఇంటి దానివి అయినందుకు చాలా సంతోషంగా ఉందని అంటున్నారు.

రాజ్ సోదరి శీతల్ ఎమోషనల్ పోస్ట్

A post shared by Sheetal Nidimoru (@sheetalnidimoru)

సమంత కొత్త జీవితాన్ని ప్రారంభించి, అత్తవారింట్లో సంతోషంగా ఉండటం అభిమానులకు ఆనందాన్ని పంచుతోంది. కుటుంబ సభ్యుల ప్రేమ, మద్దతు సమంతకు లభించడం శుభసూచకం. ఈ నూతన దంపతులకు భవిష్యత్తులో శుభాకాంక్షలు తెలుపుదాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.