
📌 Key Points
- సమంత దర్శకుడు రాజ్ నిడిమోరును రెండో వివాహం చేసుకుంది.
- పెళ్లి తర్వాత తొలిసారి భర్త రాజ్ తో ఎయిర్‌పోర్ట్‌లో మెరిసింది.
- వైరల్ అయిన వీడియోలో సమంత సన్నబడినట్లు కనిపించింది.
- సమంత, రాజ్ జంట విమానాశ్రయం వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది.
టాలీవుడ్ అగ్రతార సమంత ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరును రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత షూటింగ్‌లతో బిజీగా ఉన్న సమంత, తాజాగా తన భర్తతో కలిసి విమానాశ్రయంలో దర్శనమిచ్చింది. ఈ జంటకు సంబంధించిన క్యూట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సమంత రెండో పెళ్లి: వివరాలు
టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తరపు 15 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమంత, ఇప్పటికీ అగ్రశ్రేణి హీరోయిన్ గానే దూసుకు వెళ్తున్నారు. ఒకసారి పెళ్లయి విడాకులు అయినా కూడా ఆమె బ్రాండ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక ఇటీవల హీరోయిన్ సమంత రెండో వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరును ప్రేమించి మరి పెళ్లి చేసుకుంది సమంత.
దాదాపు ఏడాది కాలంగా వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారని సమాచారం. అయితే ప్రేమ విషయం బయట పెట్టకుండానే నేరుగా పెళ్లి చేసుకున్నారు. కొద్దిమంది సమక్షంలోనే సమంత రెండో పెళ్లి జరిగింది. అయితే రెండో పెళ్లి తర్వాత షూటింగ్ లో బిజీ అయిన సమంత తాజాగా తన భర్త రాజ్ నిడిమోరుతో విమానాశ్రయంలో మెరిసింది. సినిమా బిజీలో ఉన్న సమంత, రాజ్ తో ముంబైకి వెళుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియోలో సమంత కాస్త బక్క చిక్కినట్లు ఉంది. దీంతో వీడియో వైరల్ గా మారింది. క్లిక్
భర్త రాజ్ తో తొలిసారి సమంత
వైరల్ వీడియోలో సమంత లుక్
మొత్తానికి, సమంత రెండో పెళ్లి తర్వాత భర్త రాజ్ నిడిమోరుతో తొలిసారిగా కనిపించిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ వైరల్ వీడియో సమంత పర్సనల్ లైఫ్ పై చర్చకు దారితీసింది.


