|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అట్టహాసంగా సిరిమల్లె శారీస్ ప్రారంభించిన సమంత: సినీ తారల సందడి!

Published: 21-12-2025, 2:44 PM
అట్టహాసంగా సిరిమల్లె శారీస్ ప్రారంభించిన సమంత: సినీ తారల సందడి!
  • సమంత చేతుల మీదుగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సిరిమల్లె శారీస్ కొత్త షోరూమ్ ప్రారంభం.
  • చీరలు ప్రతి అమ్మాయికి మంచి స్నేహితురాలు అని, భారతీయ హస్తకళల ప్రాముఖ్యతను సమంత వివరించారు.
  • కాంచీపురం సిల్క్స్, బనారసీ శారీలు, డిజైనర్ బ్రైడల్ వేర్, హ్యాండ్లూమ్ శారీలు అందుబాటులో ఉన్నాయి.
  • కస్టమర్లకు లగ్జరీ, సౌకర్యవంతమైన షాపింగ్ అనుభవం కల్పించేలా షోరూమ్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

టాలీవుడ్ స్టార్ సమంత రుత్ ప్రభు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సిరిమల్లె శారీస్ కొత్త షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులు, ఫ్యాషన్ ప్రియులు, సమంత అభిమానులు భారీగా హాజరయ్యారు. చీరల ప్రాధాన్యతను సమంత వివరించగా, పలు రకాల చేనేత, డిజైనర్ శారీ కలెక్షన్లు ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి.

సమంత ప్రసంగం: చీరల గొప్పతనం

టాలీవుడ్ స్టార్, పాన్ ఇండియా నటి సమంత రుత్ ప్రభు ఈ రోజు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద సిరిమల్లె శారీస్ కొత్త షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ఫ్యాషన్ ప్రియులు, సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు మరియు సమంత అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సమంత రూత్ ప్రభు… చీరలు ప్రతి అమ్మాయికి మంచి స్నేహితురాలు వంటివని.. శారీ కలెక్షన్లు ఇక్కడ చాలా బాగున్నాయని తెలిపారు. భారతీయ హస్తకళలు, చేనేత శారీల ప్రాధాన్యతను వివరించారు. భారతదేశపు సంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని తెలిపారు.

సిరిమల్లె శారీస్: సరికొత్త కలెక్షన్స్

సిరిమల్లె శారీస్ వ్యవస్థాపకురాలు సౌజన్య మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ షోరూమ్ ప్రారంభం తమ బ్రాండ్ విస్తరణలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పేర్కొన్నారు. నాణ్యత, నమ్మకం, వినియోగదారుల సంతృప్తి పట్ల తమ నిబద్ధత కొనసాగుతుందని, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు మరియు సంప్రదాయ నెయ్యుల్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇక్కడ అందుబాటులో ఉండే ప్రతి కలెక్షన్స్ కస్టమర్ అభిరుచి మేరకు మేము తయారు చేయిస్తాము అన్నారు.

బ్రాండ్ లక్ష్యం, షాపింగ్ అనుభవం

కొత్తగా ప్రారంభించిన సిరిమల్లె శారీస్ షోరూమ్‌లో కాంచీపురం సిల్క్స్, బనారసీ శారీలు, డిజైనర్ బ్రైడల్ వేర్, పండుగల కలెక్షన్లు, హ్యాండ్లూమ్ శారీలు మరియు ఆధునిక ఎథ్నిక్ డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని వయస్సుల మహిళలకు, ప్రతి సందర్భానికి సరిపోయేలా ఈ కలెక్షన్లు రూపొందించబడ్డాయి. వినియోగదారులకు లగ్జరీ మరియు సౌకర్యవంతమైన షాపింగ్ అనుభవం కల్పించేలా షోరూమ్‌ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

సమంత ప్రారంభించిన సిరిమల్లె శారీస్ షోరూమ్ ఫ్యాషన్ ప్రియులకు, చీరల ప్రేమికులకు ఒక గొప్ప గమ్యస్థానం కానుంది. అద్భుతమైన కలెక్షన్లు, లగ్జరీ షాపింగ్ అనుభవంతో ఈ బ్రాండ్ హైదరాబాద్ ఫ్యాషన్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేయనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.