
📌 Key Points
- సమంత-రాజ్ నిడిమోరు వివాహం కోయంబత్తూర్‌లోని ఇషా ఆశ్రమంలో జరిగింది.
- పెళ్లి తర్వాత అత్తగారి కుటుంబంతో సమంత దిగిన ఫ్యామిలీ ఫోటో వైరల్ అవుతోంది.
- రాజ్ నిడిమోరు సోదరి శీతల్ నిడిమోరు ఈ ప్రత్యేకమైన కుటుంబ ఫోటోను షేర్ చేశారు.
- ఫోటోలో సమంత, రాజ్, వారి తల్లిదండ్రులు, శీతల్, ఆమె ముగ్గురు కొడుకులు ఉన్నారు.
నటి సమంత, రాజ్ నిడిమోరుల పెళ్లి ఇటీవల కోయంబత్తూర్‌లోని ఇషా ఆశ్రమంలో జరిగింది. పెళ్లి తర్వాత అత్తగారి కుటుంబంతో సమంత దిగిన ఫ్యామిలీ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజ్ సోదరి శీతల్ నిడిమోరు ఈ ఫోటోను షేర్ చేశారు. సమంత కొత్త కుటుంబాన్ని చూసి అభిమానులు సంతోషిస్తున్నారు.
సమంత – రాజ్ నిడిమోరుల వివాహం
Samantha : సమంత ఇటీవలే దర్శక నిర్మాత రాజ్ నిడిమోరుని కోయంబత్తూర్ లోని ఇషా ఆశ్రమంలో పెళ్లి చేసుకుంది. గత నాలుగేళ్లుగా డేటింగ్ లో ఉన్నారు ఈ జంట అని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ పెళ్లి తో ఆ రూమర్స్ నిజమే అని చెప్పేసారు సమంత – రాజ్.(Samantha)
సమంత – రాజ్ పెళ్లి ఫోటోలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమంత తన భర్త ఫ్యామిలీతో దిగిన ఫ్యామిలీ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. రాజ్ నిడిమోరు సోదరి శీతల్ నిడిమోరు ఈ ఫ్యామిలీ ఫోటోని షేర్ చేసింది.
వైరల్ అవుతున్న అత్తగారి ఫ్యామిలీ ఫోటో
శీతల్ నిడిమోరు షేర్ చేసిన ఈ ఫ్యామిలీ ఫొటోలో.. సమంత, తన భర్త రాజ్ నిడిమోరు, రాజ్ నిడిమోరు తల్లి తండ్రులు, రాజ్ సోదరి శీతల్, శీత ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఈ ఫొటోలో శీతల్ భర్త లేకపోవడం గమనార్హం. సమంత కొత్త ఫ్యామిలీ ఇదే అంటూ ఈ ఫోటోని ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.
ఫ్యామిలీ ఫోటోలో ఎవరెవరు ఉన్నారంటే?
ఇక శీతల్ ఈ పెళ్లి ఫోటోని షేర్ చేస్తూ ఇషాలో శివుడి ఆధ్వర్యంలో పెళ్లి జరగడం ఆనందంగా ఉంది అంటూ ఆ ఆశ్రమం గురించి రాసుకొచ్చింది. దీనికి సమంత లవ్ యు అంటూ రిప్లై ఇచ్చింది.
సమంత తన అత్తగారి కుటుంబంతో కలిసి దిగిన ఈ ఫోటో, ఆమె కొత్త బంధాలను ఎంతగానో ఆదరిస్తున్నారని తెలియజేస్తుంది. ఈ పెళ్లి తర్వాత ఆమె జీవితంలో వచ్చిన మార్పులను అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇది ఆమె కొత్త అధ్యాయానికి ఆనందకరమైన ప్రారంభం.


