|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నా భార్య కంటే నాకు సమంతే ఎక్కువ.. డైరెక్టర్ క్రేజీ కామెంట్స్..!

Published: 11-12-2025, 8:08 AM
నా భార్య కంటే నాకు సమంతే ఎక్కువ.. డైరెక్టర్ క్రేజీ కామెంట్స్..!
  • డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ సమంత గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
  • తన భార్య చిన్మయి కంటే సమంతే తనకు ఎక్కువని రాహుల్ రవీంద్రన్ పేర్కొన్నారు.
  • ‘ఏ మాయ చేశావే’ సినిమాకు ముందే సమంతతో తాను తమిళ సినిమా చేశానని రాహుల్ వివరించారు.
  • సమంత జీవితం సంతోషంగా ఉండాలని తాను, చిన్మయి కోరుకుంటామని రాహుల్ చెప్పారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన భార్య చిన్మయి కంటే సమంతే తనకు ఎక్కువ అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వారి స్నేహం, చిన్మయికి సమంతపై ఉన్న ప్రేమ గురించి ఆయన వివరించారు.

రాహుల్-సమంత స్నేహం ఎలా మొదలైంది?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి స్పెషల్ గా పరిచయం అవసరం లేదు. ఆమెకు దేశ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. దశాబ్దానికి పైగా ఆమె సినిమాలు చేస్తూ వస్తున్నారు. నాగ చైతన్యతో వివాహం తర్వాత కూడా ఆమె సినిమాలు చేయడం ఆపలేదు. కానీ నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఆమె విడాకులు తీసుకున్నారు. రీసెంట్ గా ఫ్యామిలీ మెన్ డైరెక్టర్ రాజ్ నిడుమోరు ని రెండో వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లి ఫోటోలను కూడా సమంత రీసెంట్ గా షేర్ చేసుకోగా… అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.

తాజాగా సమంత గురించి ఓ నటుడు, స్టార్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాహుల్… ‘ అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ సినిమాతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రాహుల్.. తర్వాత డైరెక్టర్ గా కూడా మారాడు. రీసెంట్ గా గర్ల్ ఫ్రెండ్ మూవీతో సూపర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా… సమంత తో తన అనుబంధాన్ని వివరించాడు.

చిన్మయికి కూడా సమంత అంటే ప్రేమ

సమంత తనకు చాలా ప్రత్యేకమని రాహుల్ చెప్పారు. ఆమెను చూస్తే తనకు తన ఎల్కేజీ క్లాస్ మెట్ లా అనిపిస్తుందని నవ్వుతూ సమాధానం చెప్పారు. అంతేకాదు… తన భార్య చిన్మయి… సమంతను ‘ డార్లింగ్ ’ అని ప్రేమగా పిలుస్తుందని, నిజానికి సామ్.. తన జీవితంలో ఇద్దరికీ కూడా ఎంతో దగ్గరైన వ్యక్తి అని వివరించాడు.

వైరల్‌గా మారిన రాహుల్ వ్యాఖ్యలు

‘ఏ మాయ చేశావే’ కంటే ముందే.. సమంత తో తాను ఒక తమిళ సినిమా చేశానని.. అప్పటి నుంచే తమ స్నేహం మొదలైందని చెప్పాడు. నా భార్య కంటే నాకు సమంతే ఎక్కువ అని కూడా చెప్పడం విశేషం. ‘ఎక్కడ ఉన్నా సమంత బాగుండాలని, ఆమె జీవితం సంతోషంగా ఉండాలి అని నేను, చిన్మయి ఇద్దరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం’ అని రాహుల్ చెప్పడం విశేషం. రాహుల్ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

రాహుల్ రవీంద్రన్ సమంతపై చేసిన ఈ ఆత్మీయ వ్యాఖ్యలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. సమంతపై వారికున్న స్నేహాన్ని, ఆప్యాయతను ఈ కామెంట్స్ మరోసారి స్పష్టం చేశాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.