📌 Key Points
- సమంత ‘మా ఇంటి బంగారం’: టీజర్ విడుదల, రెండు విభిన్న పాత్రల్లో సమంత అదరగొట్టింది!
- భర్తగా దిగంత్ నటన, పల్లెటూరి అమ్మాయిగా సమంత జీవించింది!
- అజిత్ ‘వీరం’ సినిమాకి కాపీ అంటూ ట్రోల్స్, సమంత ఫైట్స్ అదుర్స్!
- నందిని రెడ్డి దర్శకత్వం, రాజ్ నిడిమోరుతో కలిసి సమంత నిర్మాతగా వ్యవహారం!
సమంత రూత్ ప్రభు మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ‘మా ఇంటి బంగారం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చూస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనిపిస్తుంది.
సమంత కమ్‌బ్యాక్ మూవీ: మా ఇంటి బంగారం!
సమంత రూత్ ప్రభు ఒకప్పుడు సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ హీరోయిన్. కానీ ఈ మధ్య అనారోగ్య సమస్యల వల్ల అవకాశాలు తగ్గాయి. అందుకే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టింది. అయితే, ఏడాది క్రితమే సమంత ‘మా ఇంటి బంగారం` అనే మూవీని ప్రకటించింది. ఓ రకంగా ఇది సమంత కమ్ బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. అనేక కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్‌లో సమంత రెండు షేడ్స్‌లో కనిపించింది.
సమంత ‘మా ఇంటి బంగారం’ టీజర్ రిలీజైంది. ఇందులో ఆమె భర్తగా కన్నడ నటుడు దిగంత్ నటించాడు. ప్రేమించి, ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తుంది సమంత. ఉమ్మడి కుటుంబంలో ఆమె ప్రతి అడుగు పరీక్షకు గురవుతుంది. కానీ సమంత నవ్వుతూ అందరి మనసులు గెలుచుకుంటుంది.
టీజర్‌లో సమంత విశ్వరూపం!
ఇంట్లో పద్ధతిగా గల ఇల్లాలుగా కనిపించిన సమంత, ఇళ్లు దాటితో మరో అవతారం చూపించింది. రాత్రిళ్లు విశ్వరూపం చూపించింది. ఇందులో సమంత పాత్రలో మరో షేడ్ ఉంది. టీజర్‌లో చూపించినట్టు, సమంత ఏ హీరోకి తక్కువ కాదన్నట్టు ఫైట్ చేస్తుంది, విలన్లను చితక్కొడుతుంది. చీర కట్టులో ఉన్నా, కాళిలా విలన్లపై దాడి చేస్తుంది. ఈ సాహసాలన్నీ అత్తారింట్లోనే జరుగుతాయి. ఇంట్లో వాళ్ల కంట పడకుండా సమంత ఈ పనులు చేస్తుంది.
అజిత్ సినిమాకి కాపీనా? ట్రోల్స్ మొదలు!
సమంత ఆవేశానికి కారణం, ఆ రౌడీలు ఎవరనేది తెలియాలంటే సినిమా చూడాలి. టీజర్ మాత్రం అదిరిపోయింది. ఇది ట్రెండ్ అవుతుంది. సమంతలోని కొత్త కోణం ఇప్పుడు ఆడియెన్స్ చూడబోతున్నారని చెప్పొచ్చు. గతంలో `ది ఫ్యామిలీ మేన్ 2`లో ఇలా యాక్షన్ చేసింది సమంత, ఇప్పుడు మరోసారి `మా ఇంటి బంగారం` మూవీ కోసం చేస్తుంది. ఇందులో సమంత 2.0 కనిపించిందని చెప్పాలి. ఇక ఈ టీజర్‌ని చూసిన అభిమానులు ఇది అజిత్ ‘వీరం’ సినిమా కాపీ అని పోలుస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సమంత నిర్మిస్తుండటం విశేషం. అయితే ఇందులో సమంత తెలంగాణ యాసలో మాట్లాడింది. కానీ అది సెట్ కాలేదు. ఇంకా వర్క్ చేయాల్సింది. మొత్తంగా సమంత కమ్ బ్యాక్ అదిరిపోయేలా ఉండబోతుందని `మా ఇంటికి బంగారం` టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
సమంత ‘మా ఇంటి బంగారం’ టీజర్ అదిరిపోయింది. సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


