|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Samantha – Naga Chaitanya : మరోసారి ట్రెండింగ్ లో సమంత – నాగచైతన్య.. ఓ వైపు పెళ్లి.. మరో వైపు పెళ్లి రోజు..

Published: 04-12-2025, 6:10 AM
Samantha – Naga Chaitanya : మరోసారి ట్రెండింగ్ లో సమంత – నాగచైతన్య.. ఓ వైపు పెళ్లి.. మరో వైపు పెళ్లి రోజు..
  • సమంత డిసెంబర్ 1న రాజ్‌ నిడిమోరుని పెళ్లి చేసుకుని ట్రెండింగ్‌లో ఉంది.
  • నాగచైతన్య – శోభిత దంపతులు నేడు మొదటి పెళ్లి రోజు జరుపుకుంటున్నారు.
  • సమంత, నాగచైతన్య ఒకేసారి వారి జీవిత భాగస్వాములతో ట్రెండ్ అవ్వడం విశేషం.
  • ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సమయంలోనే రాజ్‌తో సమంత బంధం చైతుతో విబేధాలకు కారణమని వార్తలు.

సమంత – నాగచైతన్య మరోసారి ట్రెండింగ్‌లో నిలిచారు. ఇటీవలే సమంత రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకోగా, నేడు నాగచైతన్య, శోభిత దంపతులు వారి మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వీరిద్దరూ వారి వారి కొత్త జీవిత భాగస్వాములతో ఒకే రోజు ట్రెండ్‌ అవుతుండటం సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

సమంత – చైతు: ఒకే రోజు ట్రెండింగ్‌లో ఎందుకు?

Samantha – Naga Chaitanya : సమంత – నాగచైతన్య ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటారు. సమంత – నాగచైతన్య జంటగా ఉన్నప్పుడు బ్యూటిఫుల్ కపుల్ అని, విడిపోయాక వాళ్ళ డైవర్స్ తో, ఆ తర్వాత సమంత – రాజ్ నిడిమోరు ప్రేమ వ్యవహారంతో, తర్వాత చైతు – శోభిత పెళ్లితో వైరల్ అవుతూనే వస్తున్నారు. ఇటీవలే డిసెంబర్ 1న రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకోవడంతో గత నాలుగు రోజులుగా సమంత మరోసారి ట్రెండ్ అవుతుంది.(Samantha – Naga Chaitanya)

అయితే నేడు సమంత తో పాటు నాగచైతన్య – శోభిత కూడా ట్రెండ్ అవుతున్నారు. కారణం ఏంటి అనుకుంటున్నారా? సమంత ఇటీవలే రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకోగా వారి పెళ్లి, పెళ్లి ఫొటోలతో వైరల్ అవుతుంది. నాగచైతన్య – శోభిత మాత్రం మొదటి పెళ్లి రోజుతో వైరల్ అవుతున్నారు. అవును ఇవాళ డిసెంబర్ 4 శోభిత – చైతు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. గత సంవత్సరం ఇదే రోజు వీళ్ళు పెళ్లి చేసుకున్నారు.

నాగచైతన్య – శోభిత మొదటి పెళ్లి రోజు విశేషాలు

దీంతో నేడు ఉదయం నుంచి ఫ్యాన్స్, నెటిజన్లు, సెలబ్రిటీలు చైతు – శోభితకు వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు చెప్తున్నారు. వీరి ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. మొత్తానికి సమంత – నాగచైతన్య.. ఇద్దరూ వారి వారి జీవిత భాగస్వాములతో ఒకేసారి ట్రెండ్ అవ్వడం గమనార్హం.

సమంత నాగచైతన్య ఏ మాయ చేసావే సినిమాలో 2010లో కలిసి పనిచేసారు. ఆ పరిచయం స్నేహంగా మారింది. 2014 ఆటోనగర్ సూర్య సినిమా సమయంలో ప్రేమలో పడి 2017లో పెళ్లి చేసుకున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సీజన్ 2 సమయంలో 2020లో  రాజ్ – సమంతకు పరిచయం అయింది. అప్పటికి సమంత – నాగచైతన్య ఇంకా విడిపోలేదు. ఈ సిరీస్ సమయంలో రాజ్ – సమంత దగ్గరవ్వడం వల్లే నాగచైతన్య – సమంతకు విబేధాలు వచ్చాయని అప్పట్లో టాలీవుడ్ సమాచారం. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సెకండ్ సీజన్ 2021 జూన్ లో రిలీజ్ అవ్వగా చైతన్య – సమంత అక్టోబర్ 2021లో విడిపోయారు.

సమంత కొత్త బంధం: రాజ్‌తో పెళ్లి, కారణాలు

ఆ సిరీస్ వల్లే, రాజ్ కు సమంత దగ్గర అవ్వడం వల్లే విడిపోయారని, ఆ సిరీస్ సమయంలోనే రాజ్ – సమంతల పరిచయం ప్రేమగా మారిందని అప్పట్లో పలు వార్తలు వచ్చాయి. ఆ సిరిస్ తర్వాత నుంచి సమంత రెగ్యులర్ గా రాజ్ నిడిమోరుతో కలిసి కనిపిస్తుంది. ఆ రూమర్స్ కాస్త ఇప్పుడు పెళ్లితో నిజం చేసేసారు. ఇక సమంత పరిచయం అయ్యాకే రాజ్ కూడా 2022 లో తన భార్య శ్యామలీ కి విడాకులు ఇచ్చారు.

ఇక నాగచైతన్య సమంత తో విడిపోయాక షోయు రెస్టారెంట్ 2022 లో మొదలుపెట్టారు. ఆ రెస్టారెంట్ వల్ల సోషల్ మీడియాలో శోభిత నాగచైతన్యకు పరిచయం అయింది. వీరిద్దరికి ఫుడ్ కామన్ గా ఉండటంతో అలా శోభిత – చైతు కోజ్ అయ్యారు. వీరి పరిచయం ప్రేమగా మారి గత సంవత్సరం 2024 డిసెంబర్ 4 న పెళ్లి చేసుకున్నారు.

మొత్తానికి సమంత, నాగచైతన్య వారి జీవితాల్లో ముందుకు సాగుతూ, ఒకే రోజు వేర్వేరు శుభకార్యాలతో ట్రెండింగ్‌లో నిలవడం అందరి దృష్టిని ఆకర్షించింది. గతం ఎలా ఉన్నా, ప్రస్తుతం వారిద్దరూ తమ వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉన్నారని చెప్పవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.