|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘ఇది సత్వరమార్గాల గురించి కాదు.. మీ భవిష్యత్తు చూపించడం కోసం’ అంటూ అగ్ర తార పోస్ట్.. దేని గురించంటే?

Published: 30-05-2025, 9:21 AM
‘ఇది సత్వరమార్గాల గురించి కాదు.. మీ భవిష్యత్తు చూపించడం కోసం’ అంటూ అగ్ర తార పోస్ట్.. దేని గురించంటే?

టాలీవుడ్‌లో అగ్ర నటిగా గుర్తింపు పొందిన సమంత, తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె సోషల్ మీడియాలో @gataca.in గురించి ఓ పోస్ట్ పెట్టింది. దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Key Points

1

సమంత తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది.

2

NMN సప్లిమెంట్ల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

4

@gataca.in బ్రాండ్‌తో సమంత సహ వ్యవస్థాపకురాలిగా ఉంది.

సమంత యొక్క ఆరోగ్య ప్రయాణం

అగ్ర తార సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ కెరీర్ స్టార్టింగ్‌లోనే బోలెడన్నీ అవకాశాలు సంపాదించుకుని టాలీవుడ్ సినీ పరిశ్రమలోనే.. అత్యంత సమయంలోనే స్టార్ డమ్ దక్కించుకుంది. సీనియర్ స్టార్ హీరోలైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అండ్ సూర్య వంటి సినిమాల్లో చాన్స్ కొట్టేసి.. అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. ప్రస్తుం సామ్‌కు కోట్లలో అభిమానులు ఉన్నారని చెప్పుకోవచ్చు. కేవలం కుర్రాళ్లలో మాత్రమే కాకుండా.. ఈ బ్యూటీకి లేడీ ఫాలోయింగ్ కూడా విపరీతంగా ఉంది. అయితే సామ్ హెల్త్‌పై ప్రత్యేక శ్రద్ద వహిస్తోందన్న విషయం తెలిసిందే.

@gataca.in NMN సప్లిమెంట్లు

ముఖ్యంగా మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డప్పటినుంచి సామ్ ఆరోగ్యంపై మరింత కేర్ తీసుకుంటుంది. జిమ్‌లో వర్కౌట్స్ చేయడం, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వంటివి ఫాలో అవుతుంది. అయితే తాజాగా సామ్ సోషల్ మీడియాలో @gataca.in కేవలం సప్లిమెంట్ల గురించి ఓ పోస్ట్ పెట్టింది. ఓ వీడియో పంచుకుని.. ‘‘ మరింత స్పష్టత, మరింత బలం, మరింత స్థిరత్వం అనే ఆ తపన నన్ను NMN వైపు నడిపించింది. నేను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేదాన్ని ఎంచుకున్నాను. అంతేకాకుండా నా శరీరంతో పనిచేసేదాన్ని కోరుకున్నాను. దానికి వ్యతిరేకంగా కాదు.

సమంత యొక్క సోషల్ మీడియా పోస్ట్

సైన్స్ మద్దతు ఇచ్చేది. సుదీర్ఘ ఆట కోసం నిర్మించపడింది. కాగా ఫలితాలు వాటంతట అవే వస్తాయి. కాబట్టి నేను దానిని తీసుకుంటూనే ఉండలేదు. నేను మిషన్‌లో చేరాను. మనం సృష్టిస్తున్న దానిలో నేను నమ్ముతాను కాబట్టి నేను గటాకా సహ వ్యవస్థాపకురాలిని అయ్యాను. ఇది సత్వరమార్గాల గురించి కాదు. ఇది మీ భవిష్యత్తు కోసం చూపించడం గురించి. @gataca.in కేవలం సప్లిమెంట్ల గురించి కాదు. ఇది పనితీరు, దీర్ఘాయువు భవిష్యత్తు గురించి, సైన్స్ మద్దతుతో, ఉద్దేశ్యంతో నడిచే.. శుభ్రంగా, నిరూపితమైన అండ్ ఉద్దేశపూర్వక ఉత్పత్తులపై నిర్మించారు’’. అని సమంత పోస్ట్‌కు క్యాప్షన్ రాసుకొచ్చింది.

సమంత తన ఆరోగ్యం పట్ల చూపే శ్రద్ధ, @gataca.in బ్రాండ్‌తో ఆమె అనుబంధం అభిమానులకు స్ఫూర్తినిస్తాయి. ఆరోగ్యంపై దీర్ఘకాలిక దృష్టితో ఆలోచించడం ఎంత ముఖ్యమో ఇది చాటుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.