
📌 Key Points
- సమంత-రాజ్ నిడిమోరుల వివాహం ఇటీవలే జరిగింది, ఇది వారిద్దరికీ రెండో వివాహం.
- సమంత ధరించిన వెడ్డింగ్ రింగ్ విలువ దాదాపు 50 లక్షలు, అది నిశ్చితార్థపు రింగ్ అని వెల్లడైంది.
- సమంత ఆ నిశ్చితార్థపు రింగ్ ను గత 10 నెలల నుంచే ధరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
- పాత ఫొటోల్లో ఆమె రింగ్ తో ఇచ్చిన హింట్స్ ను నెటిజన్లు ఇప్పుడు గుర్తించి ఆశ్చర్యపోతున్నారు.
సమంత – రాజ్ నిడిమోరుల వివాహం తర్వాత వారి వెడ్డింగ్ రింగ్ గురించి చర్చ జరుగుతోంది. అది నిశ్చితార్థపు రింగ్ అని, సమంత దాదాపు 10 నెలల నుంచే ధరిస్తుందని వార్తలు వచ్చాయి. పాత ఫొటోల్లో ఆమె ఇచ్చిన హింట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
సమంత వెడ్డింగ్ రింగ్ వెనుక రహస్యం ఏమిటి?
Samantha – Raj : సమంత – రాజ్ నిడిమోరు ఇటీవలే వివాహం చేసుకున్న సంగతి తెల్సిందే. ఈ ఇద్దరికీ ఇది రెండో వివాహమే. 2020 లోనే వీరి పరిచయం కాగా 2021 నుంచే వీరు డేటింగ్ లో ఉన్నారని రూమర్స్ వచ్చాయి. గత కొన్ని రోజులుగా వీరిపై వస్తున్న ప్రేమ పుకార్లకు పెళ్లితో శుభం కార్డు వేశారు. ఇప్పటికే సమంత – రాజ్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.(Samantha – Raj)
ఈ క్రమంలో సమంత వేలికి ఉన్న వెడ్డింగ్ రింగ్ కూడా వైరల్ గా మారింది. ఈ వెడ్డింగ్ రింగ్ ప్రత్యేకంగా డైమండ్స్ చేయించిందని, పాతకాలం రాయల్ స్టైల్ అని, దీని ధర దాదాపు 50 లక్షలు అని అనేక కథనాలు వచ్చాయి ఈ వెడ్డింగ్ రింగ్ పై. అయితే ఇది ఎంగేజ్మెంట్ రింగ్ అని, సమంత దాదాపు 10 నెలల క్రితం నుంచే ఈ రింగ్ పెట్టుకుంటుందని వార్తలు ఇప్పుడు ప్రూఫ్స్ తో సహా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రాజ్ తో సమంత నిశ్చితార్థం అప్పుడే జరిగిందా?
దీంతో సమంత పాత ఫోటోలు చెక్ చేస్తున్నారు నెటిజన్లు, ఫ్యాన్స్. సమంత చాలా సార్లు పబ్లిక్ గా ఈ రింగ్ పెట్టుకొని వచ్చింది. ఈ రింగ్ తో సమంత అనేక ఫోటోలు షేర్ చేసింది కూడా. అంటే రాజ్ – సమంత నిశ్చితార్థం ఎప్పుడో చేసుకున్నారు అని భావిస్తున్నారు. సమంత ఎంగేజ్మెంట్ రింగ్ తో చాలా సార్లు హింట్ ఇచ్చినా మనమే పట్టించుకోలేదు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సమంత – రాజ్ ఎప్పట్నుంచో ప్రేమలో ఉన్నారు అనే వార్తలకు ఈ పెళ్లితో ఒక్కొక్కటి క్లారిటీ వస్తుంది. ఇదంతా నిజమే మనమే ఇన్నాళ్లు రూమర్స్ అనుకున్నామని ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.
పాత ఫొటోల్లో కనిపించిన హింట్స్, నెటిజన్ల ఆశ్చర్యం
సమంత-రాజ్ నిడిమోరుల ప్రేమ కథ నిజమని ఈ పెళ్లి రుజువు చేసింది. సమంత నిశ్చితార్థపు రింగ్ తో ఇచ్చిన హింట్స్ నిజమేనని నెటిజన్లు ఇప్పుడు గుర్తిస్తున్నారు. ఇన్నాళ్ల రూమర్స్ కు ఈ వివాహంతో స్పష్టత వచ్చింది.


