|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘మరింత రిచ్ అనుభూతిని కలిగిస్తుంది’.. నెట్టింట సెన్సేషనల్‌గా సమంత పోస్ట్

Published: 30-06-2025, 12:52 PM
‘మరింత రిచ్ అనుభూతిని కలిగిస్తుంది’.. నెట్టింట సెన్సేషనల్‌గా సమంత పోస్ట్

టాలీవుడ్ అగ్ర నటి సమంత తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో నెట్టింట సంచలనం సృష్టించింది. ‘శుభం’ సినిమా తర్వాత ఆమె ఈ పోస్ట్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.

Key Points

1

సమంత తన తొలి నిర్మాణం 'శుభం' సినిమాతో విజయం సాధించింది.

2

సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెర్ఫ్యూమ్ గురించి పోస్ట్ చేసింది.

4

సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

సమంత యొక్క తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్

హీరోయిన్ నుంచి నిర్మాతగా మారి తనలోని కొత్త టాలెంట్‌ను నిరూపించుకుంటోంది టాలీవుడ్ అగ్ర తార సమంత. ఈ బ్యూటిఫుల్ హీరోయిన్.. యూత్ ఆల్టైమ్ ఫేవరెట్ నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఏ ముహూర్తాన తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిందో తెలియదు కానీ.. కెరీర్ స్టార్టింగ్లోనే వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. అనేక చిత్రాల్లో అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసి.. స్టార్ డమ్ సంపాదించుకుంది. అయితే సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత మళ్లీ ఫామ్లోకి వచ్చింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తూ.. తనదైన టాలెంట్తో ప్రేక్షకుల్ని నెటిజన్లను ఆకట్టుకుంటోంది..

శుభం సినిమా విజయం

రీసెంట్గానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన శుభం సినిమా మంచి టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సమంత నిర్మాతగా వ్యవహరించింది. తొలి నిర్మాతగా సామ్కు ఇదే మొదటి చిత్రం. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో సమంత ముఖంలో సంతోషం కనిపించింది. దీంతో ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో వరుస పోస్టులతో ఈ నటిని ముంచెత్తారు. ఇక నెటిజన్లలో సమంత క్రేజ్ ఎప్పటికీ తగ్గదని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే.

సమంత సోషల్ మీడియా ప్రభావం

ఇకపోతే సామ్ తాజాగా నెట్టింట పర్ఫ్మూమ్ గురించి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చెప్పుకొచ్చింది. ‘శుభ్రమైన పెర్ఫ్యూమ్‌ల కోసం మేము మా ప్యాకేజింగ్‌ను ఇలా రూపొందించాం. ఎక్కువసేపు నిలిచి ఉండే, మరింత ధనికమైన అనుభూతిని కలిగించే.. మీ మానసిక స్థితిని మెరుగుపరిచే సువాసన కోసం అధిక ముఖ్యమైన నూనె సాంద్రతతో రూపొందిస్తుంది. 100 మి.లీ. బాటిల్ మీకు 800 కంటే ఎక్కువ మూడ్-లిఫ్టింగ్ స్ప్రిట్జ్‌లను అందిస్తుంది. ఇది చాలా కాలం పాటు ఉండేలా తయారుచేయడం జరిగింది. secret.alchemist శుభ్రంగా నిజాయితీగా ఉండటం పట్ల మన నమ్మకాన్ని దాచడానికి సుగంధ ద్రవ్యాలకు మించి ఏమీ లేదు’. అంటూ సామ్ రాసుకొచ్చింది.

సమంత యొక్క సోషల్ మీడియా ప్రభావం అపారం. ఈ తాజా పోస్ట్ కూడా ఆమె ఫ్యాన్స్‌ను మరింత ఆకట్టుకుంది. ఆమె కెరీర్‌లో ఇంకా ఎన్నో విజయాలు సాధిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.