|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సమంత రెండో పెళ్లిపై టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్.. వేషాలు దొబ్బకండి అంటూ పోస్ట్

Updated: 10-12-2025, 10:30 PM
సమంత రెండో పెళ్లిపై టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్.. వేషాలు దొబ్బకండి అంటూ పోస్ట్
  • సమంత, రాజ్ నిడిమోరుల రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది.
  • కొందరు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా, మరికొందరు విమర్శలు, ట్రోల్స్ చేస్తున్నారు.
  • నటి మాధవీలత ఇన్స్టాగ్రామ్ ద్వారా ట్రోలర్స్‌పై ఘాటుగా స్పందించింది.
  • ‘మీరేమీ పత్తిత్తులు కాదు, వేషాలు దొబ్బకండి’ అంటూ మాధవీలత కామెంట్స్ చేసింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, రాజ్ నిడిమోరులను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లిపై కొందరు నెటిజన్లు విమర్శలు, ట్రోల్స్ చేస్తుండగా, నటి మాధవీలత ఘాటుగా స్పందించింది. ఆమె చేసిన షాకింగ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

సమంత రెండో పెళ్లి: హాట్ టాపిక్‌గా మారిన వివాహం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), రాజ్ నిడిమోరు(Raj Nidimoru)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరిద్దరు డిసెంబర్ 1న కోయంబత్తూరులో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది. సమంత, రాజ్‌‌లకు ఇది రెండో పెళ్లి కావడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక కొత్త జంటకు కొందరు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా..మరికొందరు మాత్రం విమర్శలు, ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఈ విషయంపై టాలీవుడ్ నటి మాధవీలత(Madhavilatha) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

‘‘సమంత పెళ్లి చేసుకుంటే ఎవరెవరో ఏడుస్తున్నారు. వీళ్ళకేంటో బాధ. ఆమె ఎవరిదో సంసారం కూల్చింది? అన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ చేస్తున్న మీరే ముందుగా ఎన్ని రిలేషన్‌షిప్స్‌లో ఉన్నారో అనే విషయాన్ని ప్రశ్నించుకోండి. మరొకరి పెళ్లి చెడగొట్టి పెళ్లి చేసుకున్నవాళ్లే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు విడాకులు ఇవ్వకుండా వేరే వారిని పెళ్లి చేసుకోకుండా వ్యవహారం నడిపిస్తున్నారు. ఇక్కడ అందరూ ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. పెళ్లిళ్లు స్వర్గంలోన నిర్ణయించబడతాయి.

మాధవీలత షాకింగ్ కామెంట్స్: ట్రోలర్స్‌కి గట్టి కౌంటర్

ఎవరికి ఎప్పుడు రాసిపెట్టి ఉంటే.. అప్పటి వరకు కలిసి ఉంటారు. రుణాలు తీరిపోతే విడిపోతారు. అంతేకానీ ఒకరినొకరు చంపుకోవడం లేదు కదా? మీరేమి పత్తిత్తులు కాదు కదా. ఇలా కామెంట్లు చేసే వారి గురించి నాకు బాగా తెలుసు. ఏడ్చే సమాజం ఎలాగూ ఏడుస్తది. పెళ్లి చేసుకుంటే విష్ చేసే రోజులు పోయి పడి ఏడ్చే రోజులు వచ్చాయి. మీరు ఎదో సతి సావిత్రి.. మహా పురుషులు రాముడు అయినట్లు వేషాలు దొబ్బకండి’’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ వీడియో కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాధవీలత పోస్ట్

A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Leader ll Runs NGO ll (@actressmaadhavi)

సమంత రెండో పెళ్లిపై నటి మాధవీలత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఆమె ధైర్యవంతమైన స్పందన పలువురి ప్రశంసలు అందుకుంటుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.