
టాలీవుడ్‌లో సూపర్ స్టార్ సమంత తన తాజా ఫోటోలతో సోషల్ మీడియాను వణికించింది. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో చాలా సన్నగా కనిపించడంతో నెటిజన్లు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Key Points
సమంత తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆమె బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో చాలా సన్నగా కనిపిస్తోంది.
నెటిజన్లు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమంత ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులలో బిజీగా ఉంది.
సమంత తాజా ఫోటోలు వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ (Samantha) అందరికీ సుపరిచితమే. మయోసైటీస్ కారణంగా ఇండస్ట్రీకి దూరం అయింది. చివరగా ఆమె ‘ఖుషి’(KUSHI)మూవీలో కనపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులపాటు రెస్ట్ తీసుకుంది. ఇక ఇటీవల మళ్లీ నిర్మాతగా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. ట్రాలాలా పిక్చర్స్‌పై ‘శుభం’ చిత్రాన్ని నిర్మించిన సమంత ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించింది. ఇక ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పర్లేదు అనిపించుకుంది. ప్రస్తుతం సమంత ఓ రెండు ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది కాలంగా సామ్ ఇండస్ట్రీకి దూరం అయినా యాడ్స్ చేస్తూ చేతినిండా సంపాదిస్తోంది.
అలాగే సోషల్ మీడియాలో పలు ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది. ఆమె పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గత కొద్ది కాలంగా రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో డేటింగ్ చేస్తున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ పోతుంది. నెట్టింట ట్రోల్స్ ఎదురైనప్పటికీ ఏ మాత్రం బాధపడకుండా తన లైఫ్ తాను చూసుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోలు షేర్ చేస్తోంది. తాజాగా, సమంత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ డ్రెస్ట్ ధరించిన ఆమె స్లిమ్‌గా కనిపించి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఓమై గాడ్ అని షాక్ అవుతూ హార్ట్ సింబల్స్, ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు. అలాగే మరికొందరు ఆమె అంత సన్నగా అవడానికి కారణం మళ్లీ ఏమైనా హెల్ప్ ప్రాబ్లం అయి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.
నెటిజన్ల ఆందోళన
సమంత వృత్తి జీవితం
సమంత తన అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూనే ఉంది. కానీ, ఆమె ఆరోగ్యంపై నెటిజన్ల ఆందోళన అర్ధం చేసుకోవడం ముఖ్యం. ఆమె ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం.


