|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దుమ్మురేపే డ్యాన్స్‌తో సమంత.. ‘తస్సాదియ్యా’ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

Published: 14-04-2026, 11:05 AM
దుమ్మురేపే డ్యాన్స్‌తో సమంత.. 'తస్సాదియ్యా' సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
  • సమంత, రాజ్ నిడిమోరు నిర్మాణంలో ‘మా ఇంటి బంగారం’ చిత్రం.
  • సమ్మర్ స్పెషల్‌గా మే 15న విడుదల కానున్న సినిమా.
  • ఏప్రిల్ 16న విడుదల కానున్న ‘తస్సాదియ్యా’ ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల.
  • సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రం మే 15న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ‘తస్సాదియ్యా’ అనే మొదటి పాట ప్రోమో విడుదలైంది. ఏప్రిల్ 16న పూర్తి పాట విడుదల కానుంది. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

సమంత కొత్త సినిమా విశేషాలు

Samantha: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సమంత (Samantha) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru) తో వివాహం జరిగిన తర్వాత కొత్త జీవితంలో సంతోషంగా గడుపుతోంది. ఒకవైపు సినిమాలను నిర్మిస్తూనే.. మరొకవైపు హీరోయిన్ గా నటిస్తూ బిజీగా మారింది. అందులో భాగంగానే మా ఇంటి బంగారం అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది ఈ ముద్దుగుమ్మ. పైగా ఈ చిత్రానికి తన భర్త రాజ్ నిడిమోరు నిర్మాణంలో తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ తో కలిపి సంయుక్తంగా నిర్మిస్తోంది. ప్రముఖ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇకపోతే మే 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సమ్మర్ స్పెషల్ గా రానున్న నేపథ్యంలో ఈ సినిమా అప్డేట్స్ కూడా వదులుతూ సినిమాపై అంచనాలు పెంచుతోంది చిత్ర బృందం . ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన ప్రోమోని కాసేపటి క్రితం విడుదల చేశారు. ఈ ప్రోమోలో సమంత ఫుల్ జోష్ లో డాన్స్ చేస్తూ కనిపించింది. ముఖ్యంగా ఈ పాట మేకింగ్ వీడియోని కాస్త ప్రోమో రూపంలో రిలీజ్ చేశారు. ఇకపోతే తస్సాదియ్యా అంటూ సాగే ఫస్ట్ సాంగ్ ఏప్రిల్ 16వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు అటు సమంత కూడా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో అధికారికంగా పంచుకుంది. సమంత చీర కట్టులో ఫ్యామిలీతో కలిసి ఫుల్ జోషులో డాన్స్ చేస్తూ కనిపించి అందరి హృదయాలను దోచుకుంది. దీంతో ఒక్కసారిగా ఈ ఫ్యామిలీ డాన్స్ కోసం అభిమానులు కూడా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

‘తస్సాదియ్యా’ సాంగ్ ప్రోమో విడుదల

సమంత ఫ్యామిలీ డాన్స్ వైరల్

ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన సమంత.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. పైగా ఈ సినిమాలో నటించిన నాగచైతన్యతో ఏడేళ్ల పాటు ప్రేమాయణం సాగించి.. వివాహం చేసుకుంది. కానీ నాలుగేళ్లకే విడాకులు ఇచ్చి ఆ బంధం నుండి బయటపడింది. ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడి కొంతకాలం ఇండస్ట్రీకి కూడా దూరమైన ఈమె.. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడి ఎట్టకేలకు వివాహం చేసుకుంది. వివాహం తర్వాత సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, శుభం సినిమా నిర్మించి, నిర్మాతగా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఒకవైపు సినిమాలు, మరొకవైపు వెబ్ సిరీస్ లతో మరింత బిజీగా మారిపోయింది సమంత.

సమంత తన నటనతో, డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ‘తస్సాదియ్యా’ పాట విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం సమంతకు మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.