
📌 Key Points
- సల్మాన్ ఖాన్‌తో సమంత జోడి కట్టనుందనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్!
- రాజ్ అండ్ DK దర్శకత్వంలో భారీ యాక్షన్, హ్యూమర్ చిత్రం తెరకెక్కనుంది.
- సమంత ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’, ‘రక్త బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది.
- నయనతార కూడా ఈ సినిమాలో భాగం కానుందనేది మరో సంచలన విషయం!
టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక అదిరిపోయే న్యూస్! సమంత ఇప్పుడు బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించనుందా? ఈ వార్త నిజమైతే మాత్రం టాలీవుడ్ షేక్ అయిపోవడం ఖాయం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సల్మాన్, సమంత కాంబోలో సినిమా?
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు 16 సంవత్సరాలుగా కొనసాగుతున్న హీరోయిన్ సమంత, ఎన్నో విజయాలను అందుకున్నారు. హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేశారు సమంత. అయితే అలాంటి సమంత ఇటీవల కాలంలోనే రెండో పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో హీరోయిన్ సమంతకు బంపర్ ఆఫర్ తగిలింది.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో హీరోయిన్ సమంత బంపర్ ఆఫర్ దక్కించుకున్నారని టాక్ నడుస్తోంది. రాజ్ అండ్ DK ద్వయం ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో హ్యూమర్, యాక్షన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమాతో పాటు రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ లో చేస్తున్న సమంతకు ఈ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చినట్టు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
రాజ్ అండ్ DK దర్శకత్వంలో భారీ చిత్రం!
దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా ఇటీవల కాలంలోనే దర్శకుడు రాజ్ నిడిమోరును ( Raj Nidimoru) రెండో పెళ్లి చేసుకుంది హీరోయిన్ సమంత. ఇక అంతకు ముందు అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. 2021 సమయంలో విడాకులు ఇచ్చింది. దాదాపు ఐదేళ్లు సింగిల్ లైఫ్ లీడ్ చేసిన హీరోయిన్ సమంత, చివరికి రెండో పెళ్లి చేసుకుంది. కాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో నయనతార కూడా ఉండనున్నట్లు టాక్.
బాలీవుడ్‌లో సమంత సత్తా చాటుతుందా?
A post shared by FBO | Entertainment News Portal (@filmybaapofficial)
సమంత, సల్మాన్ ఖాన్ కలిసి నటిస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.


