|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సమంత ఉగాది మాస్ ట్రీట్: పచ్చడి చేస్తూ లైవ్ లో భర్తను అలా పిలిచి షాకిచ్చిన సామ్! దుమ్ము రేపుతున్న వీడియో!!

Published: 19-03-2026, 12:05 PM
సమంత ఉగాది మాస్ ట్రీట్: పచ్చడి చేస్తూ లైవ్ లో భర్తను అలా పిలిచి షాకిచ్చిన సామ్! దుమ్ము రేపుతున్న వీడియో!!
  • సమంత, నందిని రెడ్డి, సుమ కలిసి ఉగాది పచ్చడి చేసిన వీడియో వైరల్!
  • మా ఇంటి బంగారం మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన సమంత.
  • సమంత భర్త రాజ్ నిడిమోరు కథ అందించిన ‘మా ఇంటి బంగారం’ మూవీ!
  • సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న ‘మా ఇంటి బంగారం’.. సమంత కమ్ బ్యాక్ మూవీ అవుతుందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఉగాది వేడుకలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన రాబోయే చిత్రం ‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఉగాది పచ్చడి చేస్తూ సందడి చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

ఉగాది పచ్చడితో సమంత సందడి.. వీడియో వైరల్

Samantha Ugadi: సమంత ఉగాది పచ్చడి ఎలా చేసిందో చూశారా? యాంకర్ సుమ, డైరెక్టర్ నందిని రెడ్డితో కలిసి ఆమె చేసిన వీడియో వైరల్ అవుతోంది. మా ఇంటి బంగారం మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆమె ఉగాది పచ్చడి తయారు చేయడం ఎలా అంటూ ఈ వీడియోను రిలీజ్ చేసింది.

సమంత రూత్ ప్రభు రెండో పెళ్లి తర్వాత తన భర్త రాజ్ నిడిమోరు ఇంట్లో తొలి ఉగాదిని జరుపుకుంటోంది. అయితే ఈ సందర్భంగా తన నెక్ట్స్ మూవీ మా ఇంటి బంగారం ప్రమోషన్లు కూడా నిర్వహిస్తూ.. ఉగాది పండగనాడు తాను పచ్చడి చేసే వీడియోను షేర్ చేసింది. దీనిని తయారు చేయడంలో యాంకర్ సుమ, డైరెక్టర్ నందిని రెడ్డి ఆమెకు సాయం చేయడం ఇందులో చూడొచ్చు.

రాజ్‌ను బాబు అని పిలుస్తూ..

‘మా ఇంటి బంగారం’ మూవీ ప్రమోషన్స్‌లో స్పెషల్ ట్రీట్

మా ఇంటి బంగారం రిలీజ్ డేట్

సమంత హీరోయిన్ గా నటించడమే కాకుండా మా ఇంటి బంగారం మూవీకి ఆమెనే నిర్మాత కూడా. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ సినిమాకు సమంత భర్త రాజ్ నిడిమోరు కథ అందంచాడు. మా ఇంటి బంగారం సినిమాకు నందిని రెడ్డి డైరెక్టర్.

భర్త రాజ్ నిడిమోరు కథ.. సమంత నిర్మాతగా మూవీ!

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్

ఓ వైపు ఇంట్లో కోడలిగా పద్ధతిగా ఉండే సామ్.. బయట యాక్షన్ తో గూండాల పని పడుతుంది. అమాయకంగా నటిస్తూనే ఫైటింగ్ సీన్స్ లో యాక్షన్ మోడ్ లోకి సమంత వెళ్లిపోయింది. మా ఇంటి బంగారం మూవీ సమంతకు మంచి కమ్ బ్యాక్ అవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రం సమంతకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.