
తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి సమంత తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె పోస్ట్ లో ఏముందో చూద్దాం.
Key Points
సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
ఆ పోస్ట్ లో ఆరాధన గురించి ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
సమంతా సోషల్ మీడియా పోస్ట్
సినీ ఇండస్ట్రీలో అండ్ తెలుగు ప్రజల్లో బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ అమ్మడు సినిమాలు హిట్, ప్లాప్ ఏ టాక్ సొంతం చేసుకున్నా.. ఆల్ టైమ్ సమంత ఫ్యాన్స్ అని చెప్పుకునే కుర్రాళ్లతో సహా అమ్మాయిలు కూడా ఉన్నారు. ఈ అమ్మడు తెలుగులో అనేక నటించి.. ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. తన అందం, నటన, అభినయం, అమాయకత్వం, డ్యాన్స్తో మెప్పించిందనడంలో అతిశయోక్తిలేదు.
వైరల్ అవుతున్న సమంతా పోస్ట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసి.. స్టార్ డమ్ సంపాదించుకుంది. ఒక సంవత్సరం మయోసైటిస్ వ్యాధి కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం మళ్లీ సినిమాల బాట పట్టిన సమంత సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తూ తన సత్తా చాటుతోంది. ఇప్పటికే తను నటించిన సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది.
సమంతా అభిప్రాయం
ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ఎప్పుడూ నిశ్శబ్దంగా మెచ్చుకోవద్దు. నేను ఎవరినైనా ఆరాధిస్తే, నేను వారికి చెబుతాను. మనం మనుషులం చాలా పెళుసుగా ఉంటాం. ప్రజలు ఇక్కడ ఉన్నప్పుడే వారికి వారి పువ్వులు ఇవ్వడం ముఖ్యం. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఆరాధించకండి’’ అంటూ సామ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.
సమంత తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రజలకు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించింది. ఈ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.


