
టాలీవుడ్‌లో సినీ కార్మికుల సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తుండగా, చిన్న నిర్మాతలు వేతన పెంపుకు నిరాకరిస్తున్నారు. ఈ వివాదం టాలీవుడ్‌ను స్తంభింపజేసింది.
Key Points
సిని కార్మికుల వేతనాల పెంపుపై చిన్న నిర్మాతలు నిరాకరణ
నాలుగో రోజు సమ్మె కొనసాగుతోంది
చిన్న చిత్రాలకు వేతన పెంపు వర్తించదని నిర్మాతల వాదన
పాన్ ఇండియా సినిమాలకు జీతాల సమస్య
వేతన పెంపుపై వివాదం
సాక్షి, హైదరాబాద్: సినీ కార్మికులకు వేతనాలు పెంచే ప్రసక్తే లేదని చిన్న నిర్మాతలు తేల్చి చెప్తున్నారు. గురువారం (ఆగస్టు 7) నాడు ఫిలిం ఛాంబర్‌లో ప్రముఖ ప్రొడ్యూసర్ సి. కల్యాణ్‌తో చిన్న నిర్మాతలు సమావేశమయ్యారు. 30% వేతనాలు పెంచాలన్న కార్మికుల డిమాండ్లపై చర్చించారు. అనంతరం కల్యాణ్ మాట్లాడుతూ.. చిన్న చిత్రాలు లేకపోతే ఉపాధి లేదు. చిన్న నిర్మాతలు ఎవరితోనైనా పని చేయించుకోవచ్చు. చిన్న సినిమాలకు వేతనాల పెంపు వర్తించదు. ఒక్క పైసా కూడా పెంచేందుకు వారు సిద్ధంగా లేరు. అలా అని కార్మికులను ఇబ్బంది పెట్టాలని ఏ నిర్మాత అనుకోరు అని చెప్పుకొచ్చాడు.
నాలుగో రోజు సమ్మె
మా బాధ అర్థం చేసుకోరా? 30 శాతం వేతనాలు పెంచాలని సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ నెరవేరేవరకు షూటింగ్స్‌లో పాల్గొనేది లేదంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ( Telugu Film Industry Employees Federation ) బంద్ ప్రకటించింది. సమ్మె ఫలితంగా మూడురోజులుగా టాలీవుడ్‌లో షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నేడు నాలుగోరోజు సమ్మె కొనసాగుతోంది. సమ్మె మొదలై నాలుగు రోజులవుతున్నా మా బాధ అర్థం చేసుకోవడం లేదని కార్మికులు వాపోతున్నారు. నెలలో 10 రోజులు మాత్రమే ఉపాధి ఉంటుందని, సరైన వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాన్ ఇండియా సినిమాలకు పని చేయించుకుంటున్నారని, సకాలంలో జీతాలు ఇవ్వట్లేదని వాపోయారు.
చిన్న నిర్మాతల వాదన
సినిమా కార్మికుల సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. వేతన పెంపు విషయంలో చిన్న నిర్మాతలు, కార్మికుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. సమస్య త్వరలోనే పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది.


