
ప్రముఖ నటి సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా హీరో, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘మై ఎ ప్లస్ ఫ్రెండ్’ అని పేర్కొంటూ హార్ట్ ఎమోజీతో పోస్ట్ చేయడం ఆసక్తికరంగా ఉంది.
Key Points
సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాహుల్ రవీంద్రన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
సమంత రాహుల్‌ను 'మై ఎ ప్లస్ ఫ్రెండ్' అని పిలిచారు.
ఈ పోస్ట్‌లో హార్ట్ ఎమోజీ ఉండటం వల్ల నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సమంత ప్రస్తుతం 'రక్త బ్రహ్మాండ్' సినిమాలో నటిస్తున్నారు మరియు 'శుభం' సినిమాను నిర్మిస్తున్నారు.
సమంత సోషల్ మీడియా పోస్ట్ వైరల్
స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రస్తుతం ‘రక్త బ్రహ్మాండ్’(Rakth Brahmand) అనే మూవీలో యాక్ట్ చేస్తుంది. మరోపక్క నిర్మాతగా మారి సినిమాలు కూడా నిర్మిస్తుంది. అలా ప్రొడ్యూసర్‌గా ‘శుభం’(Shubham) అనే చిత్రాన్ని నిర్మించింది. ఇక మే 9న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం జియో హాట్ స్టార్(Jio Hotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక సమంత నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలతో పాటు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టా(Instagram) స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా సామ్ హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) ఫొటో షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే మై ఎ ప్లస్ ఫ్రెండ్.. నువ్వు నాకు ఎప్పుడూ బెస్టే.. లవ్ యు ఫర్ ఎవర్ అండ్ ఎవర్’ అనే క్యాప్షన్ రాసుకొస్తూ లవ్ సింబల్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు రాహుల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
రాహుల్ రవీంద్రన్‌కు సమంత శుభాకాంక్షలు
‘మై ఎ ప్లస్ ఫ్రెండ్’ అంటూ సమంత
సమంత తన సన్నిహితుడు రాహుల్ రవీంద్రన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విధానం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. హార్ట్ సింబల్‌తో కూడిన ఈ పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంది.


