
📌 Key Points
- సమంత సొంత బ్యానర్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రం.
- నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో భారీ అంచనాలతో వస్తున్న సినిమా.
- మే 15 నుండి జూన్ 19కి వాయిదా పడిన విడుదల తేదీతో ప్రమోషన్స్ జోరు.
- సాయంత్రం 6 గంటలకు ‘మా ఇంటి బంగారం’ నుండి మెగా సర్ ప్రైజ్ సిద్ధం.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అభిమానులకు పండగ లాంటి వార్త! ఆమె ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ, నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రం నుండి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సమంత డబుల్ ధమాకా: నటిగా, నిర్మాతగా!
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు పెంచిన సమంత.. హీరోయిన్‌గా, నిర్మతగా రాణిస్తూ మెప్పిస్తుంది. ఈ క్రమంలోనే తన సొంత బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి నిర్మిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుంది. ‘ఓ బేబీ’ తర్వాత నందిని రెడ్డి, సమంత కలయికలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 15న రావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల చేత వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్డేట్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా.. తాజాగా ఓ పోస్ట్ షేర్ చేశారు మేకర్స్. ‘సమంత అభిమానులారా, సాయంత్రం 6 గంటలకు మా ఇంటి బంగారం నుంచి ఒక సర్ప్రైజ్ కోసం సిద్ధంగా ఉండండి.. మీ అందరికీ ఇది ఖచ్చితంగా నచ్చుతుంది’ అంటూ తెలిపారు. దీంతో మా ఇంటి బంగారం నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందో అంటూ ఈగర్‌గా వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
‘మా ఇంటి బంగారం’ విడుదల తేదీ ఫిక్స్!
సాయంత్రం 6 గంటలకు రాబోయే సర్ ప్రైజ్ ఏంటి?
‘మా ఇంటి బంగారం’ నుండి రాబోయే సర్ ప్రైజ్ తో ఫ్యాన్స్ ఉత్సాహంతో ఉన్నారు. సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా పండగే. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్‌ల కోసం వేచి ఉండండి!


