
📌 Key Points
- శివాజీ, లయ జంటగా నటించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమా.
- ఈటీవీ విన్ ఓటీటీలో విడుదల కావాల్సిన సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
- మార్చి 6న థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు.
- సినిమా చూసిన ప్రముఖుల సలహా మేరకు థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయం.
శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమా విడుదల విషయంలో ఊహించని మార్పు చోటుచేసుకుంది. ఈ సినిమా ఓటీటీలో కాకుండా నేరుగా థియేటర్లలో విడుదల కానుంది. మార్చి 6న విడుదల కానుంది.
ఓటీటీ విడుదల రద్దు: థియేటర్లలోకి సినిమా
Sampradayini Suppini Suddapoosani : టాలీవుడ్ నటుడు శివాజీ సీనియర్ నటి లయ ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది .అయితే ఈ సినిమాని థియేటర్లలో కాకుండా ఈ టీవీ విన్(Etv Win) ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం తెలియ చేశారు .ఈ సినిమాని ఫిబ్రవరి 12వ తేదీ విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ఇదివరకు అధికారకంగా వెల్లడించిన సంగతి తెలిసిందే అయితే తాజాగా ఈ సినిమా విడుదల విషయంలో చిత్ర నిర్మాతలు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలుస్తోంది.
ఈ సినిమా నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలో విడుదల కాబోతుందని తెలియ చేయడమే కాకుండా అందుకు అనుగుణంగా ప్రమోషన్లను కూడా నిర్వహించారు అయితే ఈ సినిమా మరికొన్ని గంటలలో ఈటీవీ విన్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతున్న నేపథ్యంలో నిర్మాతలు తమ నిర్ణయాన్ని కూడా మార్చుకున్నారని తెలుస్తుంది .ఈ సినిమాని ఓటీటీలో కాకుండా నేరుగా థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇలా చివరి నిమిషంలో ఈ సినిమా విడుదల విషయంలో నిర్మాతలు తమ అభిప్రాయాలను మార్చుకోవడానికి కారణం లేకపోలేదు.
నిర్మాతల నిర్ణయం మార్పుకు కారణం ఏమిటి?
ఇటీవల ఈ సినిమాని కొంతమంది సినీ ప్రముఖులకు చూయించారట అయితే ఈ సినిమా అవుట్ ఫుట్ చూసిన పలువురు సెలబ్రిటీలు మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమాని బిగ్ స్క్రీన్ పై కాకుండా ఇలా ఓటీటీలో విడుదల చేయడం సరైన విషయం కాదని ఈ సినిమాకు వెండి తెరపైనే మంచి ఆదరణ వస్తుందనే సలహాలు ఇవ్వడంతో నటుడు శివాజీ ఈ సినిమా విడుదల విషయంలో ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇక శివాజీ ఈ సినిమా విడుదల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారట ఈ సినిమాని ఓటీటీలో కాకుండా నేరుగా థియేటర్ లోనే విడుదల చేయాలని భావించినట్టు సమాచారం .ఇక మార్చి 6వ తేదీ థియేటర్లలో విడుదల చేయటానికి సిద్ధమయ్యారు.
ప్రమోషన్లను పక్కనపెట్టిన చిత్ర బృందం..
మార్చి 6న విడుదల: ప్రమోషన్లు పక్కన పెట్టిన చిత్ర బృందం
ఈ సినిమాలో నటుడు శివాజీ లయ జంటగా నటించారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత మరోసారి ఈ జంట వెండి తెరపై సందడి చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలో శివాజీ నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇటీవల ట్రైలర్ విడుదల చేసినప్పటికీ ప్రమోషన్లను మాత్రం చిత్ర బృందం పూర్తిగా పక్కన పెట్టారు. ఇలా ప్రమోషన్లను పక్కన పెట్టేయడంతో ఈ సినిమా వాయిదా పడుతుందని స్పష్టమవుతుంది. త్వరలోనే ఈ సినిమా వాయిదాకు సంబంధించి అధికారక ప్రకటనను చిత్ర బృందం వెల్లడించబోతున్నారు. ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా శివాజీ వరస సినిమాలు ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
చివరి నిమిషంలో జరిగిన ఈ మార్పు సినిమాకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి. థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.


