
మలయాళ బ్యూటీ సంయుక్త తెలుగు తెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె చేతిలో 8 సినిమాలు ఉన్నాయని వినిపిస్తోంది. వాటిలో పాన్ ఇండియా చిత్రాలు కూడా ఉన్నాయి.
Key Points
సంయుక్త చేతిలో ప్రస్తుతం 8 సినిమాలున్నాయి.
అఖండ 2, పూరీ జగన్నాథ్ సినిమా వంటి పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి.
కొన్ని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నాయి.
ఈ సినిమాలతో సంయుక్త కెరీర్ మళ్ళీ ఊపందుకుంటుందని ఆశిస్తున్నారు.
సంయుక్త చేతిలో ఉన్న 8 సినిమాలు
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. హీరోలతో పాటు హీరోయిన్లు కూడా చాలా తక్కువగానే సినిమాలు చేస్తున్నారు. ఉన్నంతలో రష్మిక పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈమె కంటే బిజీగా ఉన్న మరో బ్యూటీ ఉంది. ఆమెనే మలయాళ బ్యూటీ సంయుక్త. దాదాపు ఏడాదిన్నరగా ఈమె నుంచి కొత్త మూవీ అప్డేట్ అనేదే లేదు. అలాంటిది ఇప్పుడు ఈమె చేతిలో ఏకంగా 8 మూవీస్ ఉండటం విశేషం. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?
2016 నుంచి మలయాళంలో సినిమాలు చేస్తున్న సంయుక్త.. ‘భీమ్లా నాయక్’తో టాలీవుడ్‌లోకి వచ్చింది. దీని తర్వాత బింబిసార, సర్, విరూపాక్ష.. ఇలా వరస హిట్స్ అందుకుని గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. అయితే 2023లో ఈమె హీరోయిన్‌గా చేసిన ‘డెవిల్’ ఫ్లాప్ అయింది. గతేడాది ఓ తెలుగు మూవీలో అతిథి పాత్రలో కనిపించింది. అప్పటినుంచి ఈమె నుంచి రిలీజులు ఏం లేవు. తీరా ఇప్పుడు చూస్తే ఎనిమిది చిత్రాలు లైన్‌లో ఉన్నాయి.
పాన్ ఇండియా సినిమాల ప్రభావం
సంయుక్త చేస్తున్న వాటిలో బాలకృష్ణ ‘అఖండ 2’, పూరీ-విజయ్ సేతుపతి సినిమా, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారీ’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘హైందవ’, నిఖిల్ ‘స్వయంభు’, లారెన్స్ ‘బెంజ్’, మహారాణి అనే హిందీ చిత్రం, తెలుగులో ఓ ఫిమేల్ సెంట్రిక్ చిత్రం ఈమె చేతిలో ప్రస్తుతం ఉన్నాయి. వీటిలో ‘అఖండ 2’.. ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ కానుంది. మిగిలినవన్నీ కూడా దాదాపు వచ్చే ఏడాది, ఆపై ఏడాది థియేటర్లలోకి రానున్నాయి.
సంయుక్త కెరీర్‌పై భవిష్యత్తు
సంయుక్త ప్రస్తుతం చేస్తున్న వాటిలో పూరీ-విజయ్ సేతుపతి, అఖండ 2, స్వయంభు.. పాన్ ఇండియా టార్గెట్‌గా తీస్తున్న మిగిలినవన్నీ కూడా ఆయా భాషల్లో తీస్తున్నారు. మరి వీటి వల్ల సంయుక్త కెరీర్ మళ్లీ గాడిన పడుతుందా? హీరోయిన్‍గా నిలదొక్కుకుంటుందా అనేది చూడాలి?
సంయుక్త చేతిలో ఉన్న ఎనిమిది సినిమాలు ఆమె కెరీర్‌ను మలుపు తిప్పే అవకాశం ఉంది. పాన్ ఇండియా చిత్రాలతో ఆమె కెరీర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.


