|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Samyuktha: చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో డైరెక్టర్.. హీరోయిన్‌గా చాన్స్ అందుకున్న సంయుక్త!

Published: 15-10-2025, 1:36 PM
Samyuktha: చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో డైరెక్టర్.. హీరోయిన్‌గా చాన్స్ అందుకున్న సంయుక్త!

స్టార్ హీరోయిన్ సంయుక్త ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తాజాగా ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో అవకాశం అందుకుంది. దర్శకుడు యోగి చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తూ ‘బ్లాక్ గోల్డ్’ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త కీలక పాత్ర పోషిస్తుంది.

Key Points

1

స్టార్ హీరోయిన్ సంయుక్త ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది, మంచి క్రేజ్ లో కొనసాగుతుంది.

2

వెంకటేష్ 'చింతకాయల రవి' దర్శకుడు యోగి చాలా గ్యాప్ తర్వాత 'బ్లాక్ గోల్డ్' తో రీఎంట్రీ ఇస్తున్నాడు.

4

సినిమా షూటింగ్ ఇప్పటికే 50% పూర్తయినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

సంయుక్త బిజీ షెడ్యూల్, కొత్త ప్రాజెక్టులు

బింబిసారా, సార్, విరూపాక్ష వంటి సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ సంయుక్త.. ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తుంది. ఇప్పటికే ఈ అమ్మడు చేతిలో అఖండ 2, స్వయం భూ, నారీ నారీ నడుమ మురారి చిత్రాలతో పాటు.. పూరిసేతుపతి ప్రాజెక్టులో కూడా భాగం అయింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ హీరోయిన్ ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని ఓకే చేసినట్లు తెలుస్తుంది. చాలా ఏళ్ల క్రితం వెంకటేష్ హీరోగా వచ్చిన ‘చింతకాయల రవి’ సినిమాకు దర్శకత్వం వహించిన యోగి.. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్. ఈయన ఓ లేడి ఓరియెంటెడ్ మూవీని ప్లాన్ చేస్తున్నాడట. దీనికి ‘బ్లాక్ గోల్డ్’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు టాక్. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని తెలుస్తుండగా.. ఇందులో ప్రధాన పాత్ర కోసం సంయుక్తను ఓకే చేసినట్లు టాక్. అంతే కాకుండా.. దీనికి సంబంధించి ఇప్పటికే 50% షూటింగ్ కంప్లీట్ అయినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుండగా.. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

పెళ్లికి ముందు సెక్స్.. భర్తతో కాకుండా మరొకరితో శృంగారం.. దీపిక సంచలన కామెంట్స్..

దర్శకుడు యోగి రీఎంట్రీ, ‘బ్లాక్ గోల్డ్’ వివరాలు

సంయుక్త ప్రధాన పాత్ర, షూటింగ్ అప్డేట్

సంయుక్త కీలక పాత్రలో నటిస్తున్న ‘బ్లాక్ గోల్డ్’ చిత్రం సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. చాలా గ్యాప్ తర్వాత దర్శకుడు యోగి రీఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.