|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అంత మాస్ సాంగ్ నేనెప్పుడూ చేయలేదు.. చాలా నెర్వస్‌గా అనిపించింది: సంయుక్త మీనన్

Published: 02-12-2025, 9:10 AM
అంత మాస్ సాంగ్ నేనెప్పుడూ చేయలేదు.. చాలా నెర్వస్‌గా అనిపించింది: సంయుక్త మీనన్
  • నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో ‘అఖండ 2’ డిసెంబర్ 5, 2025న విడుదల.
  • మాస్ సాంగ్ చేయడంపై సంయుక్త మీనన్ మొదట చాలా నెర్వస్‌గా ఫీలయ్యారు.
  • బాలకృష్ణతో పని చేయడం సౌకర్యంగా ఉంటుందని, ఆయన ఫ్రెండ్లీ పర్సన్ అని సంయుక్త తెలిపారు.
  • సినిమాలో తన పాత్ర చాలా స్టైలిష్‌గా, కీలకమైన సన్నివేశాల్లో ఉంటుందని సంయుక్త వివరించారు.

నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ చిత్రం డిసెంబర్ 5, 2025న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సంయుక్త మీనన్ సినిమా విశేషాలు పంచుకున్నారు. మాస్ సాంగ్ చేయడంపై ఆమె అనుభవాలు, బాలయ్యతో పని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అఖండ 2: మాస్ సాంగ్ పై సంయుక్త మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’(Akhanda -2). 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సంయుక్త విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. ‘‘ఈ సినిమాలో నా క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్‌లో చాలా కీలకంగా ఉంటుంది. నా క్యారెక్టర్ స్టయిలీష్‌గా ఉంటుంది. ఇందులో ఓ సాంగ్ చేయాలని చెప్పారు. నాకు నిజంగా ఆ పాట విన్న తర్వాత చాలా నెర్వస్‌గా అనిపించింది.

నందమూరి బాలకృష్ణతో సంయుక్త మీనన్ అనుభవం

అంత మాస్ సాంగ్ నేనెప్పుడూ చేయలేదు. తప్పకుండా పాటను అద్భుతంగా చేయాలని నిర్ణయించుకున్నాను. రెండు రోజులు ప్రాక్టీస్ తర్వాత నా మోకాలు సహకరించలేదు. తర్వాత ఫిజియోథెరపీ తీసుకున్నాను ఆడియన్స్ థియేటర్స్‌కి వచ్చిన తర్వాత వాళ్లని ఎంటర్టైన్ చేయాలి. అదే నా ఫైనల్ గోల్. నా క్యారెక్టర్ ఎందులో చాలా స్టైలిష్‌గా ఉంటుంది’’ అని చెప్పింది. అలాగే బాలయ్యతో నటించడంపై రియాక్ట్ అవుతూ.. బాలయ్య గారు చాలా ఫ్రెండ్లీ పర్సన్. ఆయన్ని తొలిసారి ఒక యాడ్ షూట్ లో కలిసాను.

అఖండ 2 విడుదల తేది, సినిమా విశేషాలు

అప్పుడే నేను ఎంతో పరిచయం ఉన్న మనిషి లాగా మాట్లాడారు. ఆయన డైరెక్టర్ యాక్టర్. డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తారు. ఆ క్వాలిటీ నాకు చాలా నచ్చింది. ఆయనతో పని చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. బాలయ్య గారికి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అంటే చాలా పాషన్ . ఆయన చాలా అంకితభావంతో అక్కడ పనిచేస్తున్నారు. తొలిసారి కలిసినప్పుడే క్యాన్సర్‌కి అవగాహన కల్పించే ఒక కార్యక్రమానికి వెళ్ళమని చెప్పారు’’ అని తన ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకుంది.

మొత్తంగా, సంయుక్త మీనన్ వ్యాఖ్యలు ‘అఖండ 2’పై అంచనాలను పెంచుతున్నాయి. బాలకృష్ణతో ఆమె కెమిస్ట్రీ, మాస్ సాంగ్‌లో ఆమె ప్రదర్శన సినిమాకు హైలైట్ కానున్నాయి. డిసెంబర్ 5, 2025న ప్రేక్షకులు సినిమాను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.