|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నా తల్లి అల్లా దగ్గరకు వెళ్లిపోయింది.. కల్యాణ్‌ రామ్‌ హీరోయిన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌!

Published: 25-06-2025, 2:20 AM
నా తల్లి అల్లా దగ్గరకు వెళ్లిపోయింది.. కల్యాణ్‌ రామ్‌ హీరోయిన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌!

ప్రముఖ నటి సనా ఖాన్ తల్లి మృతి చెందడంతో ఆమె ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. కల్యాణ్ రామ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సనా, తన తల్లి మరణ వార్తను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

Key Points

1

ప్రముఖ నటి సనా ఖాన్ తల్లి కన్నుమూశారు.

2

సనా ఖాన్ తన తల్లి మరణ వార్తను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.

4

కల్యాణ్ రామ్ సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయమైన సనా ఖాన్.

సనా ఖాన్ తల్లి కన్నుమూత

ప్రముఖ నటి, ‘బిగ్‌బాస్‌’ ఫేం సనాఖాన్‌( Sana Khan) ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి మంగళవారం మృతి చెందారు. ఈ విషయాన్ని సనాఖాన్‌ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో తెలియజేస్తూ..ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. ‘నా తల్లి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ..ఇప్పుడు అల్లా వద్దకు చేరుకున్నారు’ అంటూ సనా భావోద్వేగానికి లోనయ్యారు.తన తల్లి ఆత్మకు శాంతి కలగాలని, అందరూ ప్రార్థనలు చేయాలని ఆమె కోరారు. తల్లి మరణంతో తీవవ్ర దుఖంలో మునిగిన సనాను పలువురు సినీ ప్రముఖులు ఓదార్చారు.  అభిమానులు, సినీ ప్రముఖులు సనాకు సంతాపం తెలుపుతూ సందేశాలు పంపుతున్నారు.

ఎమోషనల్ సోషల్ మీడియా పోస్ట్

సనా ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ నటించిన ‘జై హో’ చిత్రం, వెబ్ సిరీస్ ‘స్పెషల్ ఆప్స్’ వంటి ప్రాజెక్ట్‌లతో పాటు  హింది బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. జర్నీ బాంబే టు గోవా మూవీలోనూ ఐటం సాంగ్‌ చేసింది. గోల్‌ సినిమాలో ఆమె చేసిన బిల్లో రాణి సెన్సేషన్‌ హిట్టయింది. ఈ సాంగ్‌తోనే విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది. సిలంబట్టం (తమిళ) చిత్రంతో హీరోయిన్‌గా మారింది.

సినీ ప్రముఖుల సంతాపం

కల్యాణ్‌ రామ్‌ కత్తి(2010) సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో  గగనం, మిస్టర్‌ నూకయ్య మూవీస్‌ చేసింది. మలయాళ, కన్నడ భాషల్లోనూ పలు సినిమలు చేసింది. 2020లో ముస్లిం మత గురువు ముఫ్తీ అనాస్‌ సయ్యద్‌ని వివాహం చేసుకుంది. ఈ జంటకు 2023లో బాబు పుట్టాడు. పెళ్లి తర్వాత సనా సినిమాలకు దూరంగా ఉంటుంది.

సనా ఖాన్ తల్లి మరణంతో సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.