
📌 Key Points
- సందీప్ రెడ్డి వంగా బర్త్ డే సందర్భంగా ఆయన అద్భుత విజయ గాథ.
- అర్జున్ రెడ్డి సినిమాతో దేశవ్యాప్తంగా దర్శకుడిగా భారీ గుర్తింపు.
- ఆస్తులు అమ్ముకున్న పరిస్థితి నుంచి రూ.1300 కోట్ల పైగా సంపాదన.
- ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీకి సిద్ధం.
రొమాంటిక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పుట్టినరోజు నేడు. ఆస్తులు అమ్ముకున్న పరిస్థితి నుండి వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడో ఈ కథనంలో తెలుసుకుందాం. అర్జున్ రెడ్డి నుండి యానిమల్ వరకు ఆయన ప్రస్థానం అద్భుతం.
దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా ప్రస్థానం
HBD Sandeep Reddy Vanga: తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు రొమాంటిక్ సినిమాలకు కేరాఫ్ గా నిలిచిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. గతంలో ఆయన ఎలా ఉందో కానీ అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఆయన లైఫ్ పూర్తిగా మారిపోయింది. తెలుగులో అర్జున్ రెడ్డితో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. అదే సినిమాను బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’గా తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాలను తెరకెక్కిస్తూ వస్తున్నాడు.. బాలీవుడ్ లో యానిమల్ చిత్రాన్ని తెరకేక్కించి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు.. నేడు ఈయన పుట్టినరోజు.. సెలబ్రిటీలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నేడు వంగా మామ పుట్టినరోజు సందర్బంగా ఇప్పటివరకు కూడబెట్టిన ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసుకుందాం..
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఈయన చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా బాగా పాపులర్ అయ్యారు.. ఈ దర్శకుడి సినిమా ప్రయాణం మాత్రం ఆసక్తికరంగానే సాగుతోంది. హుబ్లీ-ధార్వాడ మధ్య బోరో ఎస్.డి.ఎ. సందీప్ రెడ్డి వంగా కళాశాలలోనే సైకోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఒక్కో సినిమాతో క్రేజ్ తో పాటుగా ఆస్తులు కూడబెట్టాడు. సందీప్ రెడ్డి వంగ ఒకప్పుడు తన ఆస్తులు అమ్ముకొనే స్థితి నుంచి వేల కోట్లు సంపాదించాడు. అర్జున్ రెడ్డి నిర్మించాడు. ఆ సినిమా సక్సెస్‌తో తిరిగి 36 ఎకరాల పొలాన్ని తిరిగి కొనుకున్నాడు. ఆ తర్వాత హిందీలో కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో రూ. 1267 కోట్ల బిజినెస్ జరిగింది. అంటూ ఆయనకు 450 కోట్లు వచ్చాయి. అలా ప్రస్తుతం ఆయన ఆస్తి 1300 కోట్లకు పైగా ఉంటుందని అంచనా..
ఆస్తులు అమ్ముకున్న స్థాయి నుంచి వేల కోట్లకు
ప్రభాస్‌తో కొత్త ప్రాజెక్ట్: స్పిరిట్ విశేషాలు
బాలీవుడ్ లో ఈయన తెరకెక్కించిన యానిమల్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ప్రస్తుతం ఆ మూవీ సక్సెస్ అవడంతో పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.. ఈయన ప్రభాస్ తో చేస్తున్న సినిమా స్పిరిట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా స్టోరీ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన సినిమాలన్నీ రొమాంటిక్ జోనర్ లోనే ఉన్నాయి. మరి ప్రభాస్ కూడా అలాంటి సీన్లలో నటిస్తాడా అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేసి వేరే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలనే ఆలోచనలో వంగా ఉన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ ఆయన ఏ హీరోతో సినిమా తెరకెక్కిస్తారో చూడాలి..
సందీప్ రెడ్డి వంగా జీవిత ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని ఆయన నిరూపించారు. భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలను ఆయన అందుకోవాలని ఆశిద్దాం. ప్రభాస్‌తో ‘స్పిరిట్’ పై అంచనాలు భారీగా ఉన్నాయి.


