|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సస్పెన్స్, క్రైమ్, థ్రిల్‌ నేపథ్యంలో ‘సందిగ్ధం’

Published: 01-11-2025, 3:57 AM
సస్పెన్స్, క్రైమ్, థ్రిల్‌ నేపథ్యంలో ‘సందిగ్ధం’

సస్పెన్స్, క్రైమ్, థ్రిల్ అంశాలతో రూపొందిన ‘సందిగ్ధం’ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ కార్యక్రమంలో నటుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత సినీ పరిస్థితులు, చిత్రం విజయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. దర్శకుడు పార్థసారధి కొమ్మోజు కథా నేపథ్యం గురించి వివరించారు.

Key Points

1

‘సందిగ్ధం’ చిత్రం సస్పెన్స్, క్రైమ్, థ్రిల్ నేపథ్యంతో తెరకెక్కుతోంది.

2

టీజర్ లాంచ్ ఈవెంట్‌కు నటుడు అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

4

దర్శకుడు పార్థసారధి కొమ్మోజు భార్య సంధ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

టీజర్ విడుదల: అశోక్ కుమార్ ఏమన్నారంటే?

నిహాల్, ప్రియా దేశ్‌పాగ్, అర్జున్‌ దేవ్, కాజల్‌ తివారి, జీవ కోచెర్ల, నవీన్‌ రాజ్, చిట్టిబాబు, ఆనంద్‌ భారతి, రైజింగ్‌ రాజు, అ΄్పారావు, నాగి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘సందిగ్ధం’. పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో సంధ్య తిరువీధుల నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి నటుడు, నిర్మాత అశోక్‌ కుమార్‌ అతిథిగా హాజరయ్యారు.

దర్శకుడు పార్థసారధి కొమ్మోజు మాటలు

టీజర్‌ని రిలీజ్‌ చేసిన అనంతరం అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో పది, పదిహేను కోట్ల రూపాయలు లేకపోతే సినిమా తీయలేకపోతున్నారు. అలాగే కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. మంచి టాక్‌ వస్తేనే జనాలు థియేటర్లకు వస్తున్నారు. ‘సందిగ్ధం’ టీజర్‌ గ్రిప్పింగ్‌గా ఉంది. ఈ చిత్రం సక్సెస్‌ అవ్వాలి’’ అన్నారు.

‘సందిగ్ధం’ ప్రధాన తారాగణం, కథా నేపథ్యం

పార్థసారధి కొమ్మోజు మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్, క్రైమ్, థ్రిల్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘సందిగ్ధం’. ఇలాంటి కథ ఇంతవరకు రాలేదని చెప్పవచ్చు. నన్ను దర్శకుణ్ణి  చేయాలని ఎంతో కష్టపడి ఈ సినిమాను నిర్మించారు నా భార్య సంధ్య’’ అని చెప్పారు. ‘‘మా ‘సందిగ్ధం’ చిత్రాన్ని అందరూ ఆదరించాలి’’ అని నిహాల్, అర్జున్‌ దేవ్, ప్రియా దేశ్‌΄ాగ్, సంగీత దర్శకుడు గౌతమ్, నటులు నవీన్‌ రాజు, నరసింహ రాజు కోరారు.

‘సందిగ్ధం’ టీజర్ ఆసక్తికరంగా ఉందని అశోక్ కుమార్ ప్రశంసించారు. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొంది విజయం సాధించాలని చిత్ర బృందం ఆశిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.