|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇక నటనపైనే ఫోకస్‌: శాండీ

Published: 16-09-2025, 6:14 PM
ఇక నటనపైనే ఫోకస్‌: శాండీ

‘లియో’, ‘లోక’, ‘కిష్కింధపురి’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన కొరియోగ్రాఫర్‌-నటుడు శాండీ ఇకపై నటనపైనే దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ‘కిష్కింధపురి’ సినిమా షూటింగ్‌లో గాయపడిన విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు.

Key Points

1

శాండీ మాస్టర్ 'కిష్కింధపురి' సినిమాలో విలన్‌గా నటించారు.

2

సినిమా షూటింగ్‌లో తలకు గాయమైనా, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు.

4

హీరోగా ఒక సినిమా, మలయాళ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు.

‘కిష్కింధపురి’ విజయం

‘‘లియో, లోక, కిష్కింధపురి’… ఇలా వరుసగా నేను నటించిన చిత్రాలు హిట్‌ అయినందుకు హ్యాపీగా ఉంది. నా చిన్నప్పుడు అందరూ నా కళ్లను చూసి, ‘డెత్‌ గోట్‌ ఐస్‌’ అని ఆటపట్టించేవారు. ఆ కళ్లు నచ్చే ‘లియో’కు లోకేశ్‌గారు నన్ను నటుడిగా ఎంపిక చేసుకున్నారు’’ అన్నారు కొరియోగ్రాఫర్‌–యాక్టర్‌ శాండీ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్‌ హీరో హీరోయిన్లుగా, శాండీ మాస్టర్‌ విలన్‌గా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్‌ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది.

ఈ సందర్భంగా శాండీ మాస్టర్‌ మాట్లాడుతూ– ‘‘కిష్కింధపురి’ సినిమా కోసం లుక్‌ టెస్ట్‌ చేసి, ఫైనల్‌గా దివ్యాంగుడు లుక్‌ను ఓకే చేశాం. ఓ సీన్‌లో డమ్మీ సిలిండర్‌తో హీరో నన్ను కొట్టాలి. కానీ అనుకోకుండా నిజమైన సిలిండర్‌తో కొట్టడంతో నా తలకు దెబ్బతగిలింది.

షూటింగ్‌లో గాయం

ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్‌ తీశారు. ఇప్పుడు బాగానే ఉంది. ఇక ‘కూలీ’లోని ‘మోనికా..పాట, ‘విక్రమ్‌’లోని పాతల…పాతల’, ‘ఓజీ’ సినిమాలోని ఓ ప్రమోషనల్‌ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేశాను. ఇప్పుడు నా ఫోకస్‌ అంతా యాక్టింగ్‌పైనే. ప్రస్తుతంపా. రంజిత్‌ నిర్మాణంలో హీరోగా ఓ సినిమా, మలయాళ ‘కథనార్‌’లో విలన్‌ రోల్‌ చేస్తున్నాను’’ అని చెప్పారు.

భవిష్యత్ ప్రాజెక్టులు

‘కిష్కింధపురిని’ అందరూ చూడాలి: చిరంజీవి     ‘కిష్కింధపురి’ని హీరో చిరంజీవి ప్రత్యేకంగా వీక్షించి, ఓ వీడియో విడుదల చేశారు. ‘‘నా రాబోయే చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ నిర్మాత సాహు గారపాటిగారు నిర్మించిన ‘కిష్కింధపురి’ మంచి విజయాన్ని సాధించింది. హారర్‌ సినిమాలంటే భయాన్ని ఎలివేట్‌ చేస్తూ దెయ్యం కథ చెబుతుంటారు. కానీ, ఈ సినిమాలో హారర్‌తోపాటు మంచి సైకలాజికల్‌పాయింట్‌ని యాడ్‌ చేసి చెప్పడం చాలా బాగుంది. శారీరక వైకల్యం కంటే మానసిక వైకల్యం ప్రమాదకరమని చెప్పారు డైరెక్టర్‌ కౌశిక్‌. ఈ సినిమా ద్వారా సాయి శ్రీనివాస్, అనుపమ మంచి హిట్‌ని తమ ఖాతాలో వేసుకున్నారు. చేతన్‌ మ్యూజిక్‌ బాగుంది. ఈ సినిమాని అందరూ చూడాల్సిన అవసరం ఉంది’’ అని చిరంజీవి పేర్కొన్నారు.

తన నటనపై శాండీ మాస్టర్‌కున్న నమ్మకం మరియు రాబోయే ప్రాజెక్టులపై ఆయన ఆశాభావం ఈ ఇంటర్వ్యూ ద్వారా స్పష్టమవుతుంది. ఆయనకు భవిష్యత్తులో మంచి విజయాలు లభించాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.