|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లేడీ డైరెక్టర్ అని ఎందుకు అడుగుతారు? మీడియాకు సంగీత్ శోభన్ స్ట్రాంగ్ కౌంటర్!

Published: 02-03-2026, 2:35 PM
లేడీ డైరెక్టర్ అని ఎందుకు అడుగుతారు? మీడియాకు సంగీత్ శోభన్ స్ట్రాంగ్ కౌంటర్!
  • లేడీ డైరెక్టర్‌తో పనిచేయడంపై మీడియా ప్రశ్నకు సంగీత్ శోభన్ సమాధానం.
  • డైరెక్టర్ మానస శర్మ ప్రతిభను క్వశ్చన్ చేయడాన్ని తప్పుబట్టిన సంగీత్.
  • నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘రాకాస’ మూవీలో సంగీత్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు.
  • ఏప్రిల్ 3న విడుదల కానున్న ‘రాకాస’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ సంఘటన జరిగింది.

సంగీత్ శోభన్ ఒక మీడియా వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, లేడీ డైరెక్టర్లతో పనిచేయడం గురించి మాట్లాడారు. లింగభేదం లేకుండా ప్రతిభను చూడాలని, దర్శకురాలిగా మానస శర్మ పనితనం అద్భుతంగా ఉందని ఆయన అన్నారు.

సంగీత్ శోభన్ మీడియాకు క్లాస్ పీకడానికి కారణం ఏంటి?

Santosh Sobhan: లేడీ డైరెక్టర్‌తో సినిమా చేశారు కదా.. మీరు ఎలాంటి అనుభవాన్ని పొందారు? అని మీడియా పర్సన్ అడిగినందుకు, హీరో సంగీత్ శోభన్.. కూల్‌గా సదరు మీడియా పర్సన్‌కు క్లాస్ ఇచ్చారు. నటి, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపుని పొందిన విషయం తెలిసిందే. ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కించుకున్న నిహారిక ప్రస్తుతం మరో డిఫరెంట్ స్టోరీతో ఓ సినిమాని ఆడియెన్స్ ముందుకు తీసుకు రానున్నారు. జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో.. నిహారిక త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌గా ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. డైరెక్టర్ మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా టీజర్ లాంచ్ వేడుకను నిర్వహించారు.

‘రాకాస’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఏం జరిగింది?

ఈ వేడుకలో ఓ మీడియా పర్సన్.. లేడీ డైరెక్టర్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అంటూ ప్రశ్నించారు. దానికి సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. ‘‘నేను వర్క్ చేసింది డైరెక్టర్ మానస శర్మతో. లేడీ డైరెక్టర్ మానస శర్మతో కాదు. డైరెక్టర్‌గా ఆమె నాకు కథ చెప్పింది. మీడియా హెల్ప్ ఉండే మేల్, ఫీమేల్ అనే భేదం లేకుండా చేయవచ్చని నేను అనుకుంటాను. మీరే అలా అడుగుతుంటే.. నాకే ఏదోలా ఉంది. అసలు ఇలాంటి ప్రశ్నలు అడగకుండా ఉంటే బెటర్ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే, ఇప్పుడు మీరు జర్నలిస్ట్.. మేల్ జర్నలిస్టా, ఫీమేల్ జర్నలిస్తా కాదు.. మీరు జర్నలిస్ట్ అంతే. ఆవిడ కూడా డైరెక్టర్ అంతే. డైరెక్టర్‌కి జెండర్ ఎందుకు? నాకు ఆవిడ కథ చెప్పారు. అదిరిపోయిందని అనిపించింది. ఎవరితో చేద్దామని అనగానే, నిహారిక అన్నారు. ఇంకా అదిరిపోయింది. వాళ్లిద్దరూ ముందుండి నడిపిస్తుంటే.. ఇంక నేను ఎందుకు భయపడతాను? చెప్పండి. డైరెక్టర్ మీద నాకు నమ్మకం ఉంది. నిర్మాతకు సినిమా నిర్మాణంపై పట్టుంది. కళ్లు మూసుకుని చేసేయవచ్చు. ఆల్రెడీ నిహారికతో నేను వెబ్ సిరీస్ చేశాను. ఒక వెబ్ సిరీస్‌కు ఫస్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసింది నిహారికానే. ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. అలా ధైర్యంగా ముందుకు వెళ్లగలను. వాళ్లిద్దరూ ఉండగా నాకెందుకు డౌట్. వారిద్దరిపై ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. కళ్లు మూసుకుని చేసేశాను..’’ అని చెప్పుకొచ్చారు.

డైరెక్టర్ మానస శర్మ గురించి సంగీత్ ఏమన్నారంటే?

ఆయనలా మాట్లాడుతుంటే.. ఎదురుగా ఉన్న జర్నలిస్ట్‌లు క్లాప్స్ కొట్టారంటే.. ప్రశ్న అడిగిన జర్నలిస్ట్‌కి సంగీత్ ఎలాంటి పంచ్ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఇలాంటి ప్రశ్నలు అవసరం లేదు కూడా. ఎంతో మంది లేడీ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్లంతా సక్సెస్‌లు కూడా కొట్టారు. ఇంకా ఎందుకు? ఏ ప్రశ్నా లేకపోతే కామ్‌గా ఉంటే సరిపోతుంది కదా.. అంటూ నెటిజన్లు వైరల్ అవుతున్న వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు.

సంగీత్ శోభన్ సమాధానం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. స్త్రీ, పురుష భేదం లేకుండా ప్రతిభకు పట్టం కట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాకాస మూవీ ఏప్రిల్ 3న విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.