
📌 Key Points
- విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా హిందీలో రీమేక్ కానుంది.
- అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తుండగా, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా ఎంపికయ్యారు.
- ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు, బీమ్స్ సంగీతం అందించనున్నారు.
- తెలుగులో 300 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం బాలీవుడ్‌లో ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.
టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
హిందీలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ రీమేక్
Sankranthiki Vasthunnam Remake : ఒక భాషలో ఎంతో మంచి విజయం అందుకున్న సినిమాలను మరొక భాషలోకి రీమేక్ చేయడం అనేది సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణంగా జరుగుతుంది. ఇలా ఇప్పటికే ఎన్నో హిందీ, ఇతర భాష సినిమాలను తెలుగులో రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. అదేవిధంగా తెలుగులో సూపర్ సక్సెస్ అందుకున్న సినిమాలను కూడా ఇతర భాషలలో రీమేక్ చేస్తే అక్కడ కూడా విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇక గతేడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలలో “సంక్రాంతికి వస్తున్నాం” (Sankranthiki Vastunnam)సినిమా ఒకటి. 2024 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోయిన్ నటించిన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా హిందీ రీమేక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా అక్షయ్ కుమార్ (Akshya Kumar)నటించబోతున్నట్టు ఇదివరకు వెల్లడించారు. అయితే హీరోయిన్లుగా ఎవరు నటించబోతున్నారు అనే విషయంపై ఇన్ని రోజులు సందిగ్గం నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమాకు హీరోయిన్లు కూడా దొరికారని తెలుస్తోంది.
హీరోగా అక్షయ్ కుమార్, హీరోయిన్లు వీరే!
ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కు జోడిగా మీనాక్షి చౌదరి(Menakshi Chaudary) ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh)నటించబోతున్నట్లు సమాచారం. వీరిద్దరూ తెలుగులో నటించిన సంగతి తెలిసిందే అదే విధంగా బాలీవుడ్ రీమేక్ లో కూడా ఈ ఇద్దరు హీరోయిన్లుగా ఎంపికయ్యారని సమాచారం. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటన కూడా రాబోతుంది. ఇక ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్న నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఇక సంగీతం బీమ్స్ అందించబోతున్నారు.
సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం…
దిల్ రాజు నిర్మాతగా భారీ రీమేక్
ఇక త్వరలోనే ఈ సినిమా హిందీ రీమేక్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. తెలుగులో ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది. తెలుగులో ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం కూడా ఉండబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఈ సినిమా సీక్వెల్ పనులపై బిజీగా ఉన్నట్టు సమాచారం. ఈ సీక్వెల్ సినిమాకు “సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం” అనే టైటిల్ తో 2027 సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.
తెలుగులో మంచి విజయం సాధించిన ఈ సినిమా బాలీవుడ్‌లో కూడా అదే స్థాయిలో ఆదరణ పొందుతుందో లేదో చూడాలి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా సీక్వెల్ కూడా ఉండబోతుందని సమాచారం.


