|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sankranthiki Vasthunnam Song: గోదారిగట్టు మీద రామచిలకవే.. విదేశీ జంట డ్యాన్స్‌ చేస్తే!

Published: 25-06-2025, 1:12 PM
Sankranthiki Vasthunnam Song: గోదారిగట్టు మీద రామచిలకవే.. విదేశీ జంట డ్యాన్స్‌ చేస్తే!

‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. సినిమాలోని ‘గోదారిగట్టు మీద రామచిలకవే’ పాట ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ పాటకు ఇప్పుడు విదేశీ ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందన వస్తుంది.

Key Points

1

వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్ నటన అద్భుతం.

2

200 మిలియన్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించింది.

4

భాస్కరభట్ల సాహిత్యం, భీమ్స్ సిసిరోలియో సంగీతం ఆకట్టుకుంది.

‘గోదారిగట్టు మీద రామచిలకవే’ పాట వైరల్

ఈ ఏడాది సంక్రాంతి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి-విక్టరీ వెంకటేశ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం  థియేటర్లలో ఓ రేంజ్‌లో అదరగొట్టేసింది. పొంగల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం ఓ రేంజ్‌లో అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోనూ అందుబాటులో ఉంది.

విదేశీ జంట డ్యాన్స్ వీడియో

అయితే ఈ సినిమాలోని ఓ పాట ఆడియన్స్‌ను ఓ రేంజ్‌లో ఊపేసింది. గోదారిగట్టు మీద రామ చిలకవే అంటూ అభిమానులతో స్టెప్పలేయించింది. ఈ పాటలో వెంకీమామ, ఐశ్వర్య రాజేశ్‌ తమ డ్యాన్స్‌తో ఫ్యాన్స్‌ను మెప్పించారు. అంతేకాకుండా ఈ లిరికల్‌ వీడియో సాంగ్‌ ఏకంగా 200 మిలియన్ల వ్యూస్‌ సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.  ఈ సాంగ్‌కు భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. సుమారు 18 ఏళ్ల తర్వాత రమణగోగుల ఆలపించడం విశేషం. ఫిమేల్‌ లిరిక్స్‌ను మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది.  భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు.

సినిమా విజయానికి కారణం

అయితే ఈ పాటకు కేవలం మన ఆడియన్స్ మాత్రమే ఊగిపోయారనుకుంటే పొరపాటే అవుతుంది. తాజాగా ఫారినర్స్ కూడా ఈ సాంగ్‌కు ఫిదా అయిపోయారు. స్వీడన్‌కు చెందిన కర్ల్ స్వాన్‌బెర్గ్‌ అనే నటుడు తన సతీమణితో కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేశారు. వెంకటేశ్ ఐశ్వర్య రాజేశ్ పాత్రల్లో వీరిద్దరు అదరగొట్టేశారు. కేవలం ఈ సాంగ్ మాత్రమే కాదు.. పలు ఇండియన్ చిత్రాలకు సంబంధించిన పాటలతో పాటు డైలాగ్స్, సీన్స్ కూడా రీ క్రియేట్ చేస్తుంటారు. ఏదేమైనా ఇండియన్ సినిమాలపై వీరికున్న అభిమానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం గోదారి గట్టు మీద రామ చిలకవే సాంగ్ చూసేయండి.

చివరగా, ‘గోదారిగట్టు మీద రామచిలకవే’ పాట సినిమాకు మరింత ఆకర్షణను తీసుకొచ్చింది. విదేశీ ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన లభించడం సంతోషదాయకం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.