|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సంక్రాంతి రణరంగం: చిరంజీవికి అల్లు అర్జున్ పోటీ… మెగా అభిమానుల ఆగ్రహం!

Published: 05-01-2026, 12:30 PM
సంక్రాంతి రణరంగం: చిరంజీవికి అల్లు అర్జున్ పోటీ... మెగా అభిమానుల ఆగ్రహం!
  • చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా జనవరి 12న విడుదల కానుంది.
  • అదే రోజు అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురములో’ రీ-రిలీజ్ వార్తలు వైరల్ అవుతున్నాయి.
  • మెగా అభిమానులు ఈ పోటీపై తీవ్ర ఆగ్రహం, సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
  • కొత్త చిత్రాలకు థియేటర్లు దొరకని సమయంలో పాత సినిమాల రీ-రిలీజ్‌లపై మండిపడుతున్నారు.

సంక్రాంతికి చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురములో’ రీ-రిలీజ్ వార్తలు సినీవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒకే రోజు ఈ రెండు సినిమాలు విడుదల కావడంతో మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంక్రాంతి బరిలో మెగా హీరోల ఢీ

Allu Arjun vs Chiranjeevi: చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన మన శంకర వరప్రసాద్ గారు(MSVPG) సినిమా జనవరి 12వ తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇప్పటికీ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా ట్రైలర్ వీడియో కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తీ అయ్యాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పటికే బోలెడు సినిమాలు విడుదలకు పోటీ పడుతున్నాయి.

ఇలాంటి తరుణంలోనే పలు సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో నటించిన అలా వైకుంఠాపురములో (Ala Vaikunthapurramuloo) తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. జనవరి 12వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతుండటం విశేషం. ఇలా చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు పోటీగా అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో సినిమాని రీ రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చిరంజీవి సినిమా విడుదలయ్యే సమయంలోనే అల్లు అర్జున్ సినిమాని రీ రిలీజ్ చేయడం అవసరమా? ఉద్దేశపూర్వకంగానే ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారా? అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

అలా వైకుంఠపురములో రీ-రిలీజ్ వెనుక?

సంక్రాంతి పండుగ అంటేనే ఎన్నో సినిమాలు విడుదలవుతాయి . కొత్త సినిమాలకి థియేటర్లు దొరక్క ఇబ్బంది పడుతున్న తరుణంలో పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం ఏంటి అంటూ అభిమానులు మండిపడుతున్నారు. మరి అలా వైకుంఠపురం సినిమా తిరిగి విడుదల కాబోతోంది అంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజముంది అనేది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారకంగా స్పందించాల్సి ఉంది. ఇక అలా వైకుంఠపురం సినిమా 2020 సంవత్సరంలో సరిగ్గా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాని తిరిగి అదే రోజున విడుదల చేయాలని భావించినట్టు సమాచారం.

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభాస్ ది రాజా సాబ్, చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటితోపాటు తమిళ సినిమాలైన జననాయగన్, పరాశక్తి సినిమాలు కూడా సంక్రాంతి బరిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇలా ఈ స్థాయిలో పోటీ నడుమ  అల్లు అర్జున్ అలా వైకుంఠపురం రీ రిలీజ్ అవుతుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై మెగా అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అభిమానుల ఆగ్రహం: పోటీ అవసరమా?

‘అలా వైకుంఠపురములో’ రీ-రిలీజ్‌పై వస్తున్న వార్తలలో ఎంత నిజముందో తెలియాలంటే చిత్రబృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ పోటీ సంక్రాంతి సందడిని పెంచుతుందో లేక మెగా అభిమానుల మధ్య దూరాన్ని సృష్టిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.