|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సంక్రాంతి పోరు.. బరిలో ‘ఆ నలుగురు’

Published: 30-09-2025, 5:41 AM
సంక్రాంతి పోరు.. బరిలో ‘ఆ నలుగురు’

సంక్రాంతి 2024కి టాలీవుడ్ బాక్సాఫీస్ పోరుకు సిద్ధమవుతోంది. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, నవీన్ పొలిశెట్టి వంటి స్టార్ హీరోల చిత్రాలు బరిలో ఉన్నాయి. ఈ పండగకు ఏ సినిమా విజేతగా నిలుస్తుందో, విడుదల తేదీల వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

Key Points

1

సంక్రాంతికి టాలీవుడ్‌లో నాలుగు పెద్ద సినిమాలు పోటీపడుతున్నాయి.

2

చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు.

4

రవితేజ సినిమా జనవరి 13న విడుదలయ్యే అవకాశం ఉంది.

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి ప్లాన్

సంక్రాంతి పండగ టాలీవుడ్‌కి అతి ముఖ్యమైనది. యావరేజ్‌ సినిమా కూడా హిట్‌ అయ్యే అవకాశం ఈ పండక్కే ఉంది. ఒక వేళ హిట్‌ టాక్‌ వస్తే.. బాక్సాఫీస్‌ని షేక్‌ చేసేది కూడా పండగే. అందుకే సంక్రాంతికి రావాలని పలువురు స్టార్స్‌ ప్లాన్‌ చేసుకుంటారు. ఎప్పటి మాదిరే ఈ సారి కూడా టాలీవుడ్‌లో పొంగల్‌ పోరు గట్టిగానే ఉంది. ఇప్పటికే రెండు సినిమాలు డేట్స్‌ని ప్రకటించాయి. మరో రెండు చిత్రాలు కూడా పండగ కోసమే రెడీ అవుతున్నాయి .

అందులో ఒకటి మెగాస్టార్ ‌ చిరంజీవి ‘ మన శంకరవరప్రసాద్‌ గారు’(Mana Shankara Vara Prasad Garu) కూడా ఉంది. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ఈ మూవీ ట్యాగ్‌లైన్‌ . ట్యాగ్ ‌ లైన్ ‌ చూస్తేనే ఇది పక్కా సంక్రాంతి మూవీ అని అర్థమైపోతుంది . కానీ ఇప్పటి వరకు డేట్ ‌ మాత్రం ప్రకటించలేదు . మరోవైపు ప్రభాస్ ‌ ‘ ది రాజాసాబ్ ‌’(The Raja Saab) తో జనవరి 9 న వస్తున్నట్లు ప్రకటించాడు . అలాగే యంగ్ ‌ హీరో నవీన్ ‌ పొలిశెట్టి ‘ అనగనగా ఒక రాజు ’ తో జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు .

ప్రభాస్, నవీన్ పొలిశెట్టి తేదీలు

ఇక మిగిలిన డేట్స్ ‌ 12, 13 మాత్రమే . ఈ రెండు రోజుల్లో ఏదొ ఒక రోజు చిరంజీవి(Chiranjeevi) సినిమా రావాల్సింది . మరోవైపు రవితేజ కూడా సంక్రాంతి సమరానికి సై అంటున్నాడు . కిశోర్ ‌ తిరుమల దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఓ చిత్రం సంక్రాంతికి రిలీజ్ ‌ అవుతుందని టాక్ ‌ నడుస్తుంది . దు జనవరి 13న రిలీజ్ డేట్ లాక్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జెట్‌ స్పీడ్‌తో జరుగుతోన్న షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తవుతుందని, ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి సంక్రాంతికి రంగంలోకి దించేలా ప్లాన్ చేస్తున్నారట . ఈ లెక్కన చిరంజీవికి 12 వ తేది తప్ప మరో ఆప్షన్ ‌ లేదు .

రవితేజతో సంక్రాంతి పోరు మరింత రసవత్తరం

దసరాకి ఈ సినిమా అప్ ‌ డేట్ ‌ వస్తుంది . ఓ పాటను రిలీజ్ ‌ చేసే చాన్స్ ‌ ఉంది . అప్పుడైనా రిలీజ్ ‌ డేట్ ‌ ప్రకటిస్తారేమో చూడాలి . మొత్తానికి చిరంజీవి , ప్రభాస్ ‌, రవితేజ లాంటి స్టార్స్ ‌ తో పాటు యంగ్ ‌ హీరో నవీన్ ‌ పొలిశెట్టి కూడా పొంగల్ ‌ పోరులో ఉన్నాడు . మరీ వీరిలో ఎవరు పై చేయి సాధిస్తారో ? ఏ చిత్రం బాక్సాఫీస్ ‌ ని షేక్ ‌ చేస్తుందో చూడాలి .

మొత్తానికి ఈ సంక్రాంతికి నాలుగు పెద్ద చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ స్టార్ హీరోల చిత్రాలు ఎలాంటి రికార్డులు సృష్టిస్తాయో, ఎవరు పై చేయి సాధిస్తారో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.