|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సంక్రాంతి సమరంలో థియేటర్ల యుద్దం: ప్రభాస్ అభిమానుల ఆగ్రహం!

Published: 05-01-2026, 10:30 AM
సంక్రాంతి సమరంలో థియేటర్ల యుద్దం: ప్రభాస్ అభిమానుల ఆగ్రహం!
  • ప్రభాస్ ‘రాజా సాబ్’, విజయ్ ‘జన నాయకుడు’ జనవరి 9న విడుదల కానున్నాయి.
  • తమిళ డబ్బింగ్ సినిమాకు సమానంగా థియేటర్లు కేటాయించడంపై ప్రభాస్ అభిమానుల ఆగ్రహం.
  • తమిళనాడులో తెలుగు సినిమాలకు ఆదరణ లేనప్పుడు ఇక్కడ వారి చిత్రాలకు ఎందుకని ప్రశ్న.
  • సంక్రాంతికి ఐదు తెలుగు, రెండు తమిళ చిత్రాలతో థియేటర్ల తీవ్ర కొరత ఏర్పడింది.

ఈ సంక్రాంతికి ప్రభాస్ ‘రాజా సాబ్’, విజయ్ ‘జన నాయకుడు’ థియేటర్ల కోసం తీవ్ర పోటీ పడుతున్నాయి. తమిళ డబ్బింగ్ సినిమాలకు సమానంగా థియేటర్లు కేటాయించడంపై తెలుగు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది టాలీవుడ్‌కు అన్యాయమని వాదిస్తున్నారు.

ప్రభాస్ vs విజయ్: థియేటర్ల కోసం పోరు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్ మూవీకి ఈక్వెల్‌గా తమిళ్ హీరో విజయ్ నటించిన జన నాయకుడు’కు థియేటర్స్ ఇవ్వడంపై డార్లింగ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళ డబ్బింగ్ సినిమాలు ఇక్కడ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సంక్రాంతి అంటేనే సినిమాల సందడి. ఈసారి పొంగల్ మరింత స్పెషల్. మెగాస్టార్ మూవీతో పాటు పాన్ ఇండియా స్టార్ సినిమా, టాలీవుడ్ యంగ్ హీరోస్ మూవీస్ వరుసగా రిలీజ్ కానున్నాయి. ఏకంగా 5 తెలుగు సినిమాలు రిలీజ్ కానుండగా రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు రానున్నాయి. మెయిన్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మూవీలో సంక్రాంతి సందడి స్టార్ట్ కానుంది. ఈ సంక్రాంతికి ఎక్కువ సినిమాలు రిలీజ్ కానున్నందున తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ సమస్య ఏర్పడింది. ప్రతీ సంవత్సరం ఈ సమస్య కామన్. అయితే, ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మూవీ, తమిళ స్టార్ విజయ్ మూవీ ‘జన నాయకుడు’ ఒకే రోజున అంటే జనవరి 9న రిలీజ్ కానున్నాయి.

ప్రభాస్, మారుతి కాంబోలో వస్తోన్న ‘ది రాజా సాబ్’ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎప్పడు లేని విధంగా కొత్తగా ప్రభాస్ హారర్ కామెడీ జానర్‌లో నటించడం, డార్లింగ్ వింటేజ్ లుక్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. అటు, దళపతి విజయ్ లాస్ట్ మూవీ కావడంతో తమిళంలో ‘జన నాయకుడు’కు ఫుల్ క్రేజ్ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో ‘ది రాజా సాబ్’ మూవీతో పాటే ఈక్వెల్‌గా ‘జన నాయకుడు’కు కూడా థియేటర్స్ ఇస్తున్నారంటూ డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రభాస్ మూవీ పక్కన పెట్టి మరీ తమిళ డబ్బింగ్ సినిమా వేస్తున్నారని అంటున్నారు. అటు,తమిళనాడులో ‘ది రాజా సాబ్’కు థియేటర్స్ దొరకడం కష్టంగా మారిందని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు ఫ్యాన్స్ ఆగ్రహం ఎందుకు?

ఈ క్రమంలో అక్కడ ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో తెలుగు సినిమాలకు ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు ఇక్కడ మాత్రం వారి డబ్బింగి సినిమాలకు ఎందుకు థియేటర్స్ ఇస్తున్నారో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మన సినిమాను పక్కన పెట్టి మరీ ఆ సినిమాకు థియేటర్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది అన్యాయమని మేకర్స్, నిర్మాతలు దీనిపై రియాక్ట్ కావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. గతంలో టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ఓ ఇంటర్వ్యూలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. తమిళనాడులో తెలుగు సినిమాలకు అంత ఆదరణ ఉండదని చెప్పారు.ఈసారి సంక్రాంతికి మనవే 5 సినిమాలు వస్తున్నప్పుడు తమిళ్ సినిమాలకు ఇక్కడ థియేటర్స్ ఇవ్వాల్సిన పని లేదని చాలా మంది అభిప్రాయం. దీనిపై టాలీవుడ్ సినీ పెద్దలు ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారి సంక్రాంతి మూవీస్ లిస్ట్ చూసుకుంటే ఫస్ట్

సంక్రాంతి సినిమాల జాతర: థియేటర్ల సమస్య

ప్రభాస్ ‘ది రాజా సాబ్ మూవీ జనవరి 9 న రిలీజ్ అవుతుంది. తమిళ్ హీరో విజయ్ జన నాయకుడు సైతం జనవరి 9 నే రిలీజ్ అవుతుంది. మరో తమిళ్ హీరో శివకార్తికేయన్ పరాశక్తి మూవీ కూడా జనవరి 10 న రిలీజ్ అవుతుంది. ఇక టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ మన శంకరవరప్రసాద్ గారు – జనవరి 12న రిలీజ్ అవుతున్నాయి. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ కూడ జనవరి 13 న రిలీజ్ అవుతుంది. ఇక యంగ్ హీరో శర్వానంద్ మూవీ కూడ నారీ నారీ నడుమ మురారి జనవరి 14 న రిలీజ్ అవుతుంది. మరో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’జనవరి 14 నే రిలీజ్ అవుతుంది..

ఈ థియేటర్ల యుద్ధం కేవలం సంక్రాంతి సమస్య మాత్రమే కాదు, తెలుగు సినిమాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంపై తీవ్ర చర్చకు దారి తీస్తోంది. నిర్మాతలు, మేకర్స్ దీనిపై స్పందించాల్సిన అవసరం ఉందని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.