
📌 Key Points
- సంతోష్ శోభన్ వాలెంటైన్స్ డేకి ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీతో సందడి!
- స్కూల్ గర్ల్ ఫ్రెండ్ కైవల్లి కోసం సంతోష్ వెయిటింగ్.. వైరల్ అవుతున్న ఇంటర్వ్యూ!
- ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటూ ఆటోలో కలిసి వెళ్ళేవాళ్ళం.. స్కూల్ డేస్ గుర్తు చేసుకున్న సంతోష్!
- మానస వారణాసితో సంతోష్ శోభన్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఫుల్ ఇంటర్వ్యూ చూసేయండి!
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన స్కూల్ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలు చూద్దాం!
కైవల్లితో స్కూల్ డేస్.. సంతోష్ Nostalgic!
Santosh Soban : చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు సంతోష్ శోభన్. కాకపోతే సంతోష్ హిట్ కొట్టి చాలా కాలం అయింది. సంతోష్ శోభన్ ఈ వాలెంటైన్స్ డేకి కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు సంతోష్.(Santosh Soban)
ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఓ ఇంటర్వ్యూలో సంతోష్ శోభన్ తన స్కూల్ లవ్ స్టోరీ గురించి చెప్పాడు.
‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రమోషన్స్‌లో లవ్ స్టోరీ రివీల్!
సంతోష్ శోభన్ తన లవ్ స్టోరీ గురించి చెప్తూ.. కైవల్లి అని స్కూల్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో ఏంటో. ఇప్పుడన్నా ఆమె కనెక్ట్ అయి ఫీల్ అవుతుందేమో. ఆమె నాకు చాలా ఇష్టం కానీ వర్కౌట్ అవ్వలేదు. ఒకే అపార్ట్మెంట్ లో ఉండటం వల్ల ఇంకా దగ్గరయ్యాం. స్కూల్ కి ఇద్దరం ఆటోలో కలిసి వెళ్లి కలిసి వచ్చేవాళ్ళం. తనతో అలా ఎక్కువ టైం గడిపేవాడిని. ఇప్పుడు ఎక్కడుందో తెలీదు అని అన్నారు.
దీంతో సంతోష్ శోభన్ స్కూల్ లవ్ స్టోరీ వైరల్ గా మారింది. సంతోష్ ఇప్పటికైనా తనకి కనెక్ట్ అయి ఫీల్ అవుతుందేమో అనడంతో ఇంకా ఆ అమ్మాయి కోసమే వెయిట్ చేస్తున్నాడు అంటూ ఈ ఇంటర్వ్యూని వైరల్ చేస్తున్నారు. మరి ఆ అమ్మాయి ఎవరో ఈ ఇంటర్వ్యూ చూసి సంతోష్ ని కాంటాక్ట్ అవుతుందేమో చూడాలి.
సంతోష్ కోసం కైవల్లి వస్తుందా?
సంతోష్ శోభన్ మానస వారణాసి కపుల్ ఫ్రెండ్లీ ఫుల్ ఇంటర్వ్యూ ఇక్కడ చూసేయండి..
సంతోష్ శోభన్ తన స్కూల్ గర్ల్ ఫ్రెండ్‌ను గుర్తు చేసుకుంటూ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


