|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

40 ఏళ్ల హీరోతో సారా రొమాన్స్ పై సెన్సేషనల్ కామెంట్స్! దెబ్బకు దిమ్మతిరిగేలా!

Updated: 21-01-2026, 12:28 AM
షాకింగ్: 40 ఏళ్ల హీరోతో సారా రొమాన్స్ పై సెన్సేషనల్ కామెంట్స్! దెబ్బకు దిమ్మతిరిగేలా!
  • రణ్‌వీర్ సింగ్‌తో సారా అర్జున్ రొమాన్స్ పై ట్రోల్స్!
  • ‘ధురంధర్’ మూవీలో రణ్‌వీర్, సారా మధ్య 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ పై నెటిజన్ల కామెంట్స్!
  • విమర్శకులకు సారా కౌంటర్: రణ్‌వీర్ గొప్ప కో-స్టార్, సెట్‌లో అందరినీ జాగ్రత్తగా చూసుకుంటారు!
  • ‘ధురంధర్ 2’ మార్చి 19, 2026న విడుదల! మొదటి పార్ట్ రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధం!

టాలీవుడ్ లో సంచలనం! రణ్‌వీర్ సింగ్ సరసన సారా అర్జున్ నటించడం హాట్ టాపిక్ గా మారింది. వారిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ పై వస్తున్న విమర్శలపై సారా ఎలా స్పందించిందో చూడండి.

రణ్‌వీర్ – సారా జోడిపై ట్రోల్స్!

ఆదిత్య ధర్ (Aditya Dhar)దర్శకత్వంలో వచ్చిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్'(Dhurandhar). గతేడాది డిసెంబర్‌లో విడుదలై 1300 కోట్లకు పైగా వసూళ్లతో 2025లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాలో రణవీర్ సింగ్(Ranveer Singh) పక్కన 20 ఏళ్ల సారా అర్జున్‌ను హీరోయిన్‌గా నటించి సెన్సేషనల్‌గా మారింది. ఈ చిత్రంపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. హీరోహీరోయిన్ ఏజ్ గ్యాప్‌పై నెట్టింట పెద్ద దుమారమే నడుస్తోంది. రణ్‌వీర్ సింగ్ తనకంటే 20 ఏళ్లు చిన్న అయిన సారాతో రొమాన్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సారా అర్జున్ ఈ విషయంపై స్పందించి షాకింగ్ కామెంట్స్ చేసింది. “సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ నేను పెద్దగా పట్టించుకోను. సినిమా కోసం నేను సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాను.

ఎవరి అభిప్రాయం వాళ్ళది, అందరినీ గౌరవించాల్సిందే. అయితే కథ ప్రకారం మా ఇద్దరి జంట ఎందుకు ఉండాలో నాకు తెలుసు, ఆ విషయంలో నాకు పూర్తి స్పష్టత ఉంది. రణవీర్ సింగ్ కంటే గొప్ప కో-స్టార్ నాకు దొరకడు. ఆయన నటన మీద ఎంత ఫోకస్ పెడతారో, సెట్‌లోని అందరినీ అంతే జాగ్రత్తగా చూసుకుంటారు. రణ్‌వీర్ అందరినీ కలుపుకుని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి” అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా అమ్మడు విమర్శలకులకు గట్టిగానే ఇచ్చిపడేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్ వంటి హేమాహేమీలు నటించారు. పాకిస్థాన్ నేపథ్యంలో సాగే ఈ స్పై థ్రిల్లర్‌కు సీక్వెల్‌గా ‘ధురంధర్ 2’ మార్చి 19న 2026లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫస్ట్ పార్ట్ సృష్టించిన రికార్డుల వల్ల పార్ట్-2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సారా అర్జున్ స్ట్రాంగ్ కౌంటర్!

‘ధురంధర్ 2’ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

సారా అర్జున్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘ధురంధర్ 2’ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.