|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సర్కార్ సీజన్ 6: సుధీర్ అల్లేఖ్యలతో రచ్చ రచ్చే! ప్రోమోతోనే హీటెక్కిన ఆహా!

Published: 24-02-2026, 2:05 AM
సర్కార్ సీజన్ 6: సుధీర్ అల్లేఖ్యలతో రచ్చ రచ్చే! ప్రోమోతోనే హీటెక్కిన ఆహా!
  • సర్కార్ సీజన్ 6 ప్రోమో విడుదల: సుధీర్ హోస్టింగ్ అదుర్స్!
  • హెబ్బా పటేల్, రాశి సింగ్‌లతో సుధీర్ కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్!
  • ఫిబ్రవరి 27 సాయంత్రం 7 గంటలకు ఆహాలో ప్రీమియర్!
  • అఖిల్, మోనాల్ గజ్జర్ ఎంట్రీతో ఎంటర్టైన్మెంట్ డోస్ డబుల్!

ఆహాలో సర్కార్ సీజన్ 6 వచ్చేసింది! సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా, హీరోయిన్ల గ్లామర్‌తో ఈసారి ఎంటర్టైన్మెంట్ ఓ రేంజ్‌లో ఉండబోతోంది. ప్రోమో రిలీజ్ అయింది, ఇక రచ్చ మామూలుగా ఉండదు!

సుధీర్ మార్క్ కామెడీతో ప్రోమో అదిరింది!

Sarkaar Season 6; ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమ్ అయ్యే సర్కార్ గేమ్ షోకి ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా చేస్తున్న ఈ షో ఇప్పటికే విజయవంతంగా 5 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు సరికొత్త సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యింది. తాజాగా దీనికి సంబందించిన ప్రోమో(Sarkaar Season 6) విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమో చూశాక ఈసారి ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతుంది అని పక్కాగా అర్థమవుతోంది.

ఇక ఈ ప్రోమోలో ఎప్పటిలాగే సుధీర్ తన టైపు కామెడీ టైమింగ్ తో అదరగోటేశాడు. హెబ్బా పటేల్, రాశి సింగ్, గేహన సిప్పి, పాయల్ రాజ్ పుత్ లతో మనోడు చేసిన కామెడీ నెక్స్ట్ లెవల్లో ఉంది. ఇక ఆ తరువాత వచ్చిన అఖిల్, మోనాల్ గజ్జర్ కూడా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేశారు. మరో ప్రోమోలోనే ఈ రేంజ్ ఫన్ ఉంది అంటే ఎపిసోడ్స్ లో ఇంకా ఏ రేంజ్ లో ఉంటాయి అనేది మన ఊహకే వదిలేశారు మేకర్స్. మరి ఈ కొత్త సీజన్ ఏ శుక్రవారం అంటే ఫిబ్రవరి 27 సాయంత్రం 7 గంటల నుంచి మొదలుకానుంది. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి.

హెబ్బా, రాశితో సుధీర్ రొమాంటిక్ యాంగిల్ అదుర్స్!

ఫిబ్రవరి 27 నుంచి ఆహాలో సర్కార్ సందడి!

సర్కార్ సీజన్ 6 ఫిబ్రవరి 27 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. సుధీర్ కామెడీ టైమింగ్, హీరోయిన్ల గ్లామర్ మిస్ అవ్వకండి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.