|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సత్యదేవ్, ఫరియా అబ్దుల్లా జోడీతో సెట్స్ మీదకి కొత్త చిత్రం! రామానాయుడు స్టూడియోలో సందడి!!

Published: 18-02-2026, 6:35 AM
సత్యదేవ్, ఫరియా అబ్దుల్లా జోడీతో సెట్స్ మీదకి కొత్త చిత్రం! రామానాయుడు స్టూడియోలో సందడి!!
  • సత్యదేవ్ 15వ చిత్రం రామానాయుడు స్టూడియోలో ప్రారంభం
  • ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఎంటర్‌టైనింగ్‌గా ఉండనుంది
  • అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టారు
  • రామ్ మిరియాల సంగీతం అందిస్తున్న ఈ సినిమా సత్యదేవ్ కెరీర్‌లో పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నారు

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ తన 15వ చిత్రాన్ని ఫరియా అబ్దుల్లాతో కలిసి ప్రారంభించారు. ఈ సినిమా రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. అనిల్ రావిపూడి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రామానాయుడు స్టూడియోలో సత్యదేవ్ సినిమా ప్రారంభం

Satyadev: టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ (Satyadev) నూతన చిత్రానికి క్లాప్ పడింది. అన్ని రకాల పాత్రలతో నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ చేస్తునన 15వ చిత్రమిది. త్రిశూల్ విజినరీ స్టూడియోస్ బ్యానర్ పై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కంప్లీట్ ఎంటర్‌టైనింగ్ స్క్రి‌ప్ట్‌తో.. దర్శకుడు లక్ష్మినారాయణ పుట్టంచెట్టి రూపొందిస్తున్నారు. సత్యదేవ్ సరసన ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో, పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమంలో సత్యదేవ్, ఫరియా హంగామా చేసి ఆహుతుల్ని అలరించారు. ఈ ప్రారంభోత్సవానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరో హీరోయిన్లపై అనిల్ రావిపూడి తొలి క్లాప్ ఇచ్చారు. యంగ్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి కెమెరా స్విఛ్ ఆన్ చేయగా, లక్ష్మినారాయణ పుట్టంచెట్టి ఫస్ట్ షాట్‌ను డైరెక్ట్ చేశారు.

ఫరియా అబ్దుల్లాతో సత్యదేవ్ జోడీ

ఈ సందర్భంగా డైరెక్టర్ లక్ష్మి నారాయణ పుట్టంచెట్టి మాట్లాడుతూ.. ఈ సినిమా జానర్ ఏంటి? అని అంతా అడుగుతున్నారు. అందరి పెదాలపై నవ్వుల పూయించే ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రమిది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం. రామ్ మిరియాల ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ ఒక కంప్లీట్ మూవీకి రామ్ మిరియాల సంగీతాన్ని అందిస్తున్నారు. సత్యదేవ్ కెరీర్‌లో ఇదొక పెద్ద హిట్ చిత్రంగా నిలుస్తుందని భావిస్తున్నాము. ఫరియా గ్లామర్ మరో ప్రధాన ఆకర్షణ కానుంది. మాకు సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్. కచ్చితంగా ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని అన్నారు.

అనిల్ రావిపూడి చేతుల మీదుగా ప్రారంభోత్సవం

అనిల్ రావిపూడి ఈ సినిమా టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సత్యదేవ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఈ సినిమా ఆయన కెరీర్‌కు ఉపయోగపడాలని కోరారు. మరో అతిథి వంశీ నందిపాటి మాట్లాడుతూ.. నా స్నేహితుడు నరేంద్ర రెడ్డి మరో మంచి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సత్యదేవ్ ఫస్ట్ టైమ్ ఒక ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆయనకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే, ఈ సినిమా స్టోరీ నాకు తెలుసు. సత్యదేవ్ ఫస్ట్ టైమ్ ఇలాంటి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సాధించబోయే విజయం గురించి తర్వాత ముందు ముందు జరిగే ఈవెంట్స్‌లో మాట్లాడతాను. డైరెక్టర్ లక్ష్మినారాయణకు, ఆయన టీమ్‌కు కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది. ఈ టీమ్ అందరికీ కంగ్రాట్స్ అని చెప్పుకొచ్చారు. సత్యదేవ్‌తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందని, ప్రస్తుతం రెండు పాటలు కంప్లీట్ చేశామని సంగీత దర్శకుడు రామ్ మిరియాల తెలిపారు.

సత్యదేవ్ కెరీర్‌లో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఫరియా అబ్దుల్లా గ్లామర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.